Anni Manchi Sakunamule | టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ (Santosh Soban) నటిస్తున్న మూవీ అన్నీ మంచి శకునములే (Anni Manchi Sakunamule). రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రాన్ని నందినీ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ నుంచి విడుదల చేసిన సీతాకళ్యాణ వైభోగమే, గల గల యేరులా లిరికల్ వీడియోసాంగ్, అన్నీ మంచి శకునములే టైటిల్ సాంగ్స్ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేసేలా ఉన్నాయి.
మిక్కీ జే మేయర్ కంపోజిషన్‌లో వచ్చిన ఈ పాటలను మూవీ లవర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా సాగే చెయ్యి చెయ్యి కలిపేద్దాం పాటను లాంఛ్ చేశారు మేకర్స్. చంద్రబోస్ రాసిన ఈ పాటను శ్రీకృష్ణ, వేణు శ్రీ రంగం, సాందీప్, ఛైత్ర అంబడిపూడి పాడారు. ఈ పాట ఫెస్టివల్ మూడ్‌లో విందు భోజనంలా సాగుతూ ఇంప్రెస్ చేస్తోంది.
ఈ చిత్రంలో మాళవికా నాయర్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. నరేశ్, రాజేంద్రప్రసాద్, రావురమేశ్, గౌతమి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెన్నెల కిశోర్, అర్జుణ, అంజు అల్వా నాయక్, ఊర్వశి, అశ్విన్ కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని స్వప్నాదత్, ప్రియాంకా దత్ స్వప్నా సినిమా బ్యానర్‌పై మిత్రవింద ఫిలిమ్స్ బ్యానర్‌తో కలిసి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం మే 18న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
చెయ్యి చెయ్యి కలిపేద్దాం లిరికల్ వీడియో సాంగ్..
అచ్చ తెలుగు పెళ్లి విందు భోజనం 😋💚#CheyyiCheyyiKalipeddam Lyrical Video out now 🎵
▶️ https://t.co/klWwJQlrDa#AnniManchiSakunamule @santoshsoban #MalvikaNair #NandiniReddy @MickeyJMeyer @SwapnaCinema @VyjayanthiFilms @SonyMusicSouth pic.twitter.com/VZTmr0fYxs
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 8, 2023
గల గల యేరులా లిరికల్ వీడియో సాంగ్..
సీతాకళ్యాణ వైభోగమే లిరికల్ వీడియో సాంగ్..
అన్నీ మంచి శకునములే టైటిల్ సాంగ్..