మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 14, 2020 , 08:38:38

సుశాంత్ కేసు క్లోజ్ చేసేందుకు సిద్ద‌మ‌వుతున్న పోలీసులు

సుశాంత్ కేసు క్లోజ్ చేసేందుకు సిద్ద‌మ‌వుతున్న పోలీసులు

జూన్ 14న బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందిన సుశాంత్ కొంద‌రి వేధింపుల వ‌ల‌న‌నే ఇలాంటి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని ప‌లువురు వాద‌న‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఐదుగురితో కూడిన బృందం దాదాపు 35 మందికి పైగా వ్య‌క్తుల‌ని విచారించింది.  సుశాంత్ కుటుంబ సభ్యులు, స‌న్నిహితులు, కొలీగ్స్  అంద‌రితో మాట్లాడారు. అతడి గదిలో అన్ని వస్తువులనూ స్వాధీనపరుచుకుని పరిశీలించారు.

గ‌త కొద్ది రోజులుగా సీరియ‌స్‌గా న‌డుస్తున్న విచార‌ణ ప్ర‌క్రియ‌కి ముగింపు ప‌లకాల‌ని అధికారులు భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. విచార‌ణ‌లో ఎలాంటి విష‌యాలు బ‌య‌ట‌కు రాలేద‌ని, వేర‌కొరి ప్ర‌మేయం ఉందా లేదా అనే దానిపై ఫోరెన్సిక నిపుణుల‌తో కూడా మాట్లాడ‌మ‌ని, అన్ని విష‌యాల‌పై స‌మగ్ర నివేదిక‌ని రూపొందిస్తున్నామ‌ని పోలీసులు అంటున్నారు. తుది నివేద‌క‌ని ఇంకో ప‌ది రోజుల‌లో ఉన్న‌తాధికారుల‌కి అప్ప‌గించ‌నున్నార‌ట‌. ఎలాంటి సంచ‌ల‌నాలు లేకుండానే త్వ‌ర‌లోనే ఈ కేసు క్లోజ్ కానుంద‌ని స‌మాచారం

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo