Allu Arjun | టాలీవుడ్ స్టార్ నటుడు అల్లు అర్జున్ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం తర్వాత గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు. నటుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం కేసుపై మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఇప్పటికే అల్లు అర్జున్ను అరెస్ట్‌ని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇంతకు ముందే క్వాష్ పిటిషన్ దాఖలు చేశామని, దీన్ని అత్యవసరంగా విచారించాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు కోరారు. అయితే, మధ్యాహ్నం చెబితే ఎలా? అంటూ హైకోర్టు పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించింది. విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది.
ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం సర్వత్రా చర్చ సాగుతున్నది. ఆయనకు కోర్టు బెయిల్ ఇస్తుందా? లేదా? జైలుకు వెళ్లాల్సి వస్తుందా? మరికొద్ది సేపట్లో తేలనున్నది. ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్లో పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా వచ్చారు. ఆ సమయంలోనే ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు గాయాలకు గురయ్యాడు. ఘటనలో మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు అల్లు అర్జున్‌తోపాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ముగ్గురిని అరెస్టు చేశారు. అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్‌పై బీఎన్ఎస్ 118 (1), బీఎన్ఎస్ 105, రెడ్‌విత్ 3/5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.