Jonathan Majors | చిక్కుల్లో మార్వెల్ స్టార్ జోనాథన్ మేజర్స్.. ప్రియురాలిపై దాడిలో కేసులో హాలీవుడ్ అరెస్ట్..!
Jonathan Majors |
Jonathan Majors | హాలీవుడ్ స్టార్ జోనాథన్ మేజర్స్ వివాదాల్లో చిక్కుకున్నారు. దాడి, వేధింపులు తదితర ఆరోపణలపై శనివారం మాన్హాటన్లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆరోపణలు చేసింది మరెవరో కాదు అతని ప్రియురాలు. జోనాథన్ మేజర్స్‌ను శనివారం ఉదయం 11:15 గంటలకు చెల్సియాలోని వెస్ట్‌లోని 8వ అవెన్యూ సమీపంలో అరెస్టు చేశారు. బ్రూక్లిన్‌లోని ఓ బార్ నుంచి ఇద్దరూ కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా టాక్సీలో వచ్చిన జోనాథన్‌తో వాగ్వాదం జరిగిందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వాగ్వాదం జరిగిన సమయంలో జోనాథన్ దాడి చేయడంతో తలకు, వీపు, చెవుల వెనుక భాగం, ముఖంపై గాయాలైనట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత బాధితురాలిని పోలీసులు ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, జోనాథన్ మేజర్స్ అమాయకుడని, ఏ తప్పూ చేయలేదని అతని ప్రతినిధి పేర్కొన్నాడు. అయితే, ఇద్దరి మధ్య గొడవకు కారణం జోనాథన్ తన మొబైల్ నుంచి మరో మహిళకు మెస్సేజ్ చేయడం అతని ప్రియురాలు చూసింది.
దాంతో అతని ఫోన్‌ను పరిశీలించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. అడగడంతో కోపోద్రిక్తుడైన జోనాథన్ ప్రియురాలిపై దాడికి పాల్పడ్డాడు. దాంతో వెంటనే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అరెస్టు చేసి, ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. జోనాథన్ చివరిసారిగా క్రీడ్-3, యాంట్ మ్యాన్ అండ్ క్వాంటుమానియాలో కనిపించాడు. ఆస్కార్ అవార్డుల వేడుకలో క్రీడ్-3 సహనటుడు మైఖేల్ బీ జోర్డాన్‌తో కలిసి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.
Actress Akanksha Dubey | చిత్రపరిశ్రమలో మరో విషాదం.. యువ నటి ఆకాంక్ష దూబే ఆత్మహత్య..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

