Actress Akanksha Dubey | చిత్రపరిశ్రమలో మరో విషాదం.. యువ నటి ఆకాంక్ష దూబే ఆత్మహత్య..!
Actress Akanksha Dubey | భారతీయ చిత్ర పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుకున్నాది. భోజ్‌పూరి యువనటి నటి ఆకాంక్ష దూబే (25) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఓ హోటల్లో నటి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది.
Actress Akanksha Dubey | భారతీయ చిత్ర పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. భోజ్‌పూరి యువనటి నటి ఆకాంక్ష దూబే (25) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఓ హోటల్లో నటి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. శనివారం రాత్రి షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చిన ఆకాంక్ష సారనాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమేంద్ర హోటల్లో చేరుకుంది. ఆదివారం హోటల్ గదిలో ఉరికి వేలాడుతూ కనిపించింది.
ఆకాంక్ష దూబే 1997, అక్టోబర్ 21న ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్లో జన్మించింది. ఆకాంక్ష సోషల్ మీడియా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేది. ఇన్‌స్టాలో ఆకాంక్ష దూబేకి దాదాపు 17 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఆత్మహత్యకు ముందు ఆకాంక్ష స్వయంగా ఓ వీడియో సాంగ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో సాంగ్‌లో ఆకాంక్ష భోజ్‌పురి సూపర్‌స్టార్ పవన్ సింగ్‌తో కలిసి నటించింది. ఈ పాట పోస్టర్‌ను ఆకాంక్ష దూబే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఆకాంక్ష దుబే భోజ్‌పురి పరిశ్రమలో రాకేష్ మిశ్రా మ్యూజిక్ వీడియో ‘తు జవాన్ హమ్ లైకా’తో తన కెరీర్‌ను ప్రారంభించింది.
ఈ మ్యూజిక్ వీడియో చాలా విజయవంతమైంది. దీని తర్వాత, ఆకాంక్ష ప్రతి భోజ్‌పురి స్టార్‌తో బుల్లెట్ పై జీజా, కార్వతి వంటి అనేక భోజ్‌పురి మ్యూజిక్ వీడియోల్లో పని చేసింది. భోజ్‌పురిలో ముజ్సే షాదీ కరోగి, వీరన్ కే వీర్, ఫైటర్ కింగ్ వంటి చిత్రాల్లో నటించింది. ఈ భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే చాలా కాలంగా సమర్ సింగ్‌తో రిలేషన్షిప్లో ఉన్నట్లు సమాచారం. సమర్ సింగ్‌పై తనకున్న ప్రేమను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసేది. అయితే, ఆత్మహత్యకు గల కారణాలు ఏంటన్నది తెలియరాలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

