Pindam Movie | గర్భిణులు ఈ సినిమా చూడవద్దన్న సెన్సార్ బోర్డు.!
Pindam Movie | ఒకరికి ఒకరు (Okariki Okaru) ఫేమ్ శ్రీరామ్ (Sriram) నటిస్తున్న తాజా చిత్రం ‘పిండం’(Pindam). ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. కుశీ రవి (Kushi Ravi) హీరోయిన్గా నటిస్తుండగా.. సాయికిరణ్ దైదా (Sai Kiran Daida) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
Pindam Movie | ఒకరికి ఒకరు (Okariki Okaru) ఫేమ్ శ్రీరామ్ (Sriram) నటిస్తున్న తాజా చిత్రం ‘పిండం’(Pindam). ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఖుషి రవి (Kushi Ravi) హీరోయిన్గా నటిస్తుండగా.. సాయికిరణ్ దైదా (Sai Kiran Daida) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సాయికిరణ్కు ఇదే మొదటి మూవీ. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్తో పాటు టీజర్, ట్రైలర్లు విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది.
సెన్సార్ బోర్డు ఈ మూవీకి ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ.. ఈ సినిమాను గర్భిణులు చూడవద్దని సెన్సార్ బోర్డు హెచ్చరిక జారీచేసినట్లు తెలిపింది.
The scariest film gets more scarier!!#PINDAM certified with a clean “A” Certificate. In theatres worldwide from December 15th 🔥
Statutory Warning: Pregnant women are adviced not to watch this film.@saikirandaida @Yeshwan71014110 @EswariRao @kalaahimedia… pic.twitter.com/7HwLw3EQHE
— Vamsi Kaka (@vamsikaka) December 11, 2023
ఈ సినిమాను డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కళాహి మీడియా పతాకం (Kalahi Media Banner)పై యశ్వంత్ దగ్గుమాటి (Yashwanth Daggumaati) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీరామ్తో పాటు, ఈశ్వరీరావు, రవివర్మ, మాణిక్ రెడ్డి, బేబీ చైత్ర, బేబీ ఈషా, విజయలక్ష్మి, శ్రీలత తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
ఓ మారుమూల పల్లెటురిలో చాలా రోజులుగా ఎవరూ నివసించని ఒక ఇంట్లోకి హీరో శ్రీరామ్ తన కుటుంబంతో వస్తాడు. అయితే ఆ ఇంట్లో అడుగుపెట్టిన అనంతరం వారికి అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. ఇంట్లో ఉన్న ఆత్మ.. శ్రీరామ్ కుటుంబానికి నిద్ర లేకుండా, ప్రాణ భయంతో వణికిపోయేలా చేస్తుంది. అలాంటి సమయంలో వారికి సాయం చేయడానికి మంత్రగత్తె ఈశ్వరీ రావు వస్తుంది. అయితే ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? ఆ ఆత్మల కథ ఏంటి? వాటి నుంచి శ్రీరామ్ కుటుంబాన్ని ఈశ్వరీ రావు రక్షించిందా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

