జూలై 12న ‘ఇండియన్-2’?
కమల్‌హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇండియన్-2’ చిత్రం గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జూలై 12న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారని తెలిసింది.
కమల్‌హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇండియన్-2’ చిత్రం గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జూలై 12న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారని తెలిసింది. ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం. కమల్‌హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన సంచలన చిత్రం‘ఇండియన్’కు సీక్వెల్ ఇది. గత మూడేళ్ల నుంచి ఈ సినిమా ఎన్నో అవాంతరాలను అధిగమించి షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నదని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకుండా దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా సమకాలీన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బలమైన సామాజిక సందేశంతో ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె.సూర్య, బాబీ సింహ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్నందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

