ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ కన్నడరంగంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. కన్నడ స్టార్ హీరో గణేష్‌తో వారు ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ బి.ధనంజయ్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు.
ఈ విషయాన్ని శనివారం ఓ ప్రకటన ద్వారా పీపుల్‌మీడియా సంస్థ తెలియజేసింది. తమ సంస్థ నుంచి వస్తున్న 49వ సినిమా ఇదని, కన్నడ సినిమా సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసేలా ఈ సినిమా ఉంటుందని పీపుల్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తామని వారు చెప్పారు.