Payal Rajput | తెలుగు రాష్ట్రాలతోపాటు పాన్ ఇండియావైడ్‌గా ఇప్పుడంతా పుష్పరాజ్ మేనియా కొనసాగుతుంది. సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్ పోషించిన సీక్వెల్ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే థియేటర్ల వద్ద మోత మోగిపోతుంది.
పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్ అంటూ సాగే డైలాగ్స్‌ను అనుసరిస్తూ మూవీ లవర్స్ చేస్తున్న వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ ఈ డైలాగ్ డబ్ స్మాష్ వీడియో చేసింది. గ్లామర్‌తో మెస్మరైజ్ చేస్తూ పుష్పరాజ్ స్టైల్లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ సేమ్ డైలాగ్‌ను చెప్పింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే మరికొన్ని గంటల్లో పుష్ప స్పెషల్ షోలు పడబోతున్నాయని తెలిసిందే. సీక్వెల్లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
#PayalRajput enacts #WildFire dialogue from #Pushpa2TheRule ! 🔥#AlluArjun #Pushpa2 #AssaluThaggedheLe #FahadhFaasil pic.twitter.com/lJpMQ1j1Fy
— Praysure.in (@Praysurein) December 4, 2024
Ram Gopal Varma | సినిమా టికెట్ ధరల మీదే ఏడుపెందుకు.. రాంగోపాల్ వర్మ పుష్ప 2 ఇడ్లీల కథ చదివారా..?
They Call Him OG | ఎప్పుడొచ్చామన్నది కాదు అన్నయ్యా.. ట్విటర్‌లోకి ఓజీ డైరెక్టర్ గ్రాండ్ ఎంట్రీ