Chiranjeevi | నా అఛీవ్మెంట్స్ గురించి చెప్పాను. పవన్ కల్యాణ్, రాంచరణ్ నా అఛీవ్ మెంట్స్. నా ఫ్యామిలీలో ఉన్న అందరు బిడ్డలు నా అఛీవ్మెంట్. వీళ్లందరినీ చూస్తుంటే ఇది కదా నేను సాధించిందనిపిస్తుందన్నాడు. ఏపీలో జరిగిన ఓ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. మొన్న పవన్ కల్యాణ్ ఇంటికొచ్చినప్పుడు ఒక మాటన్నాడు. అన్నయ్య నువ్వు ఓ మాట అనేవాడివి గుర్తుందా.. అంటే ఏమన్నాను రా అని అడిగాను.
మన ఇంట్లో ఇంతమంది ఉన్నందుకు భగవంతుడు నాకీ అవకాశం ఇచ్చినందుకు ఇది నాతో ఆగిపోకూడదు. ఒక రాజ్‌కపూర్ ఫ్యామిలీలో ఎంతమంది ఎలా ఉన్నారో.. ఆ రకంగా మరో రాజ్ కపూర్ ఫ్యామిలీ మన మెగా ఫ్యామిలీ అవ్వాలని చెప్పావు.
ఈ రోజున చూస్తుంటే తలచుకుంటే నీ మాట ప్రభావం.. నీ మాట మంత్రంగా పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది పదిమందిదాకా ఉన్నామంటే గనుక నీ మాట పవర్.. ఎందుకంటే నువ్వేదో నిష్కల్మషంగా అంటావు.. అందులో ఎలాంటి పొల్యూషన్ ఉండదు కాబట్టి దానికి బలం ఎక్కువ అన్నయ్య. మంచి మనసుతో పాజిటివ్‌తో అంటావు.. అని అంటే అవును కదా అనుకున్నాను.
తెలియకుండా అదే ఒక పత్రిక కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అని మా గురించి ప్రస్తావించినపుడు.. హ భగవంతుడా ఇది మా గొప్పతనం కాదు.. నువ్వు, ఈ ప్రజలు, అభిమానులు, ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు కాబట్టే మేం ఈ స్థాయిలో ఉన్నామంటూ చెప్పుకొచ్చాడు చిరంజీవి. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ItsOkayGuru | ‘ఇట్స్ ఓకే గురు’ తప్పకుండా అందరినీ అలరిస్తుంది : మెహర్ రమేష్
Hyderabad | అంత్యక్రియలకు డబ్బుల్లేక మృతదేహంతో మూడు రోజులు
ICC | భారత క్రికెటర్లకు షాకిచ్చిన ఐసీసీ.. మ్యాచ్ ఫీజులో భారీ కోత..!