Pawan kalyan | ఈ రోజుల్లో స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడమే గగనం అనుకుంటున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ఏకంగా నాలుగు సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అది కూడా ఈయన యాక్టర్ కమ్ పొలిటీషియన్. ఇలాంటి సమయంలో రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ ఇటు సినిమాలు కూడా ఒకేసారి పూర్తి చేయడం అంటే అంత చిన్న విషయం కాదు. అందుకే ఈయనతో సినిమాలకు కమిట్ అయిన నిర్మాతలకు కూడా నిద్ర పట్టడం లేదు.
ఎప్పుడు డేట్స్ ఇస్తాడో.. ఎప్పుడు రాజకీయాలు అంటూ వెళ్లిపోతాడో అర్థం కాక వాళ్లు తలలు పట్టుకుని కూర్చున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ వాళ్లందరికీ కచ్చితంగా న్యాయం చేయాలని చూస్తున్నాడు. అందుకే తనతో సినిమాలకు కమిట్ అయిన దర్శకులు అందరికీ పవన్ చెప్పిన ఒకే ఒక కండిషన్ నెల రోజులు మాత్రమే డేట్స్ ఇస్తానని..! ఎలాంటి సినిమా అయినా.. ఎంత పెద్ద కథ అయినా తనతో సినిమా చేయాలంటే కేవలం 30 రోజుల్లో మాత్రమే పూర్తి చేయాలని కండిషన్ పెడుతున్నాడు పవన్ కళ్యాణ్. సముద్రఖని లాంటి దర్శకులకైతే కేవలం 20 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చాడు .
అందులోనే తన పార్ట్ పూర్తి చేసి మిగిలిన సినిమాను మెల్లగా చేసుకోవాలంటూ దర్శక నిర్మాతలకు చెప్తున్నాడు పవర్ స్టార్. అన్నట్లుగానే ఒకేసారి నాలుగు సినిమాలకు డేట్స్ ఇచ్చేశాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇది రెండు భాగాలుగా వస్తుంది. తొలి భాగం ఇదే ఏడాది విడుదల కానుంది. రెండో భాగం మాత్రం ఎన్నికల తర్వాత విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు దర్శకుడు క్రిష్. మరోవైపు సాయిధరమ్ తేజ్ తో పవన్ కళ్యాణ్ నటిస్తున్న వినోదయ సీతం రీమేక్ షూటింగ్ ఇప్పటికే మొదలైపోయింది. ఈ సినిమా కోసం నెలకు 4 రోజుల డేట్స్ కేటాయించాడు పవన్ కళ్యాణ్.
అలాగే మార్చి నుంచి హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నాడు. ఇక ఏప్రిల్ మొదటి వారం నుంచి సుజిత్ ఓజి సినిమాకు డేట్స్ ఇచ్చాడు పవన్. ఎలా చూసుకున్నా కూడా 2023 క్యాలెండర్ మారేసరికి ఒప్పుకున్న సినిమాలన్నింటిని షూటింగ్ పూర్తి చేయాలని పక్కాగా ఫిక్స్ అయ్యాడు. వచ్చే ఏడాది పూర్తిగా ఎన్నికలకు సమయం కేటాయించాలని చూస్తున్నాడు ఈయన. ఆగస్టులో వినోదయ సీతం రీమేక్.. సెప్టెంబర్ లో హరిహర వీరమల్లు.. దసరాకు ఓజి.. సంక్రాంతికి ఉస్తాద్ విడుదల చేయాలనేది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్లానింగ్. ఇది కానీ వర్కౌట్ అయిందంటే అంతకంటే సంచలనం మరొకటి ఉండదు. అభిమానులు కూడా ఇదే వర్కౌట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.
Ponniyin Selvan 2 | పొన్నియన్ సెల్వన్ 2 వాయిదాపై మణిరత్నం టీం క్లారిటీ
Kamal Haasan | మా టీం రోజంతా కష్టపడుతోంది.. ఇండియన్ 2పై కమల్ హాసన్
Kavya Kalyanram | సిరిసిల్లకొస్తే మా అమ్మమ్మ ఊరికి వచ్చినట్టనిపిస్తది : కావ్యా కళ్యాణ్ రామ్
Naveen Polishetty | అనుష్కతో నవీన్ పొలిశెట్టి ఫన్ చిట్‌చాట్.. టైటిల్ అనౌన్స్ మెంట్ అప్డేట్