Pawan- Prakash Raj | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్రబిందువయ్యాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన రాజ్య భాషా విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న పవన్ మాట్లాడుతూ, హిందీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాతృభాష తెలుగు అమ్మ అయితే, హిందీ పెద్దమ్మ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చెప్పారు. హిందీని వ్యతిరేకించడం అంటే రాబోయే తరాల అభివృద్ధిని అడ్డుకోవడమే అవుతుందని పేర్కొన్నారు. హిందీలో డబ్ అయిన 31% దక్షిణాది సి నిమాలు ఆదాయం తెచ్చిపెడుతున్నాయని గుర్తుచేశారు.
వ్యాపారానికి హిందీ కావాలి కానీ, నేర్చుకోవడానికి ఎందుకు ఇబ్బంది అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. పవన్ వ్యాఖ్యల వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ..“ఈ రేంజ్‌కి అమ్ముకోవడమా… ఛీ ఛీ…” అంటూ కౌంటర్ ఇచ్చారు. దీనిపై #JustAsking హ్యాష్‌ట్యాగ్‌తో సెటైరిక్ టోన్‌లో విమర్శలు గుప్పించారు. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలకు జనసేన అభిమానులు మరియు నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. నువ్వన్నట్టు అందరు మిగతా భాషలని ద్వేషించుకుంటూ పోతే ఇన్ని సినిమాలు నువ్వు చేసేవాడివా, ఇంత సంపాదించే వాడివా? జాతీయ స్థాయిలో ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునేవాడివా? ఇంత జీవితం చూసేవాడివా ప్రకాశ్ రాజ్ అన్నా అంటూ ఒక జనసైనికుడు కౌంటర్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ హిందీపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ విరుచుకుపడడంతో ఈ అంశం మరింత చర్చకు దారి తీస్తోంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని కామెంట్స్‌పై ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పించారు. అయితే ఏ రోజు కూడా ప్రకాశ్ రాజ్ ట్వీట్స్‌పై పవన్ స్పందించింది లేదు. మరి తాజా ట్వీట్‌పై పవన్ నుండి ఏదైన రియాక్షన్ వస్తుందా చూడాలి.