Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). హరీష్ శంకర్ (Harish shankar) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. రాశీఖన్నా కీలక పాత్ర పోషిస్తోంఇ. టాలీవుడ్ టాప్ లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ సింగిల్ దేఖ్ లేంగే సాలా నెట్టింటిని షేక్ చేస్తుందని తెలిసిందే. తాజాగా మరో క్రేజీ అప్డేట్ అందించారు మేకర్స్. ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ రాసిన బ్యాక్ గ్రౌండ్ సాంగ్ రెడీ అయింది. ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ సెస్నేషనల్ లిరిక్స్‌తో పవన్ స్టార్ మేనరిజాన్ని మరోసారి చూపించబోతుంది. వేచి ఉండండి.. అంటూ చంద్రబోస్ రిలిక్స్ సిద్దం చేస్తున్న స్టిల్‌ను షేర్ చేశారు. ఇప్పుడీ స్టిల్ నెట్టింట వైరల్ అవుతూ మరో బ్లాక్ బస్టర్ సాంగ్ రెడీ అవుతుందని చెప్పకనే చెబుతోంది.
దేవీ శ్రీ ప్రసాద్ కంపోజిషన్‌లో విశాల్ దడ్లానీ పాడిన రంపంపం రంపంపం స్టెప్పేస్తే భూకంపం.. దేఖ్లేంగే సాలా సాంగ్ అంటూ లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్‌లోని స్టైలిష్ డ్యాన్స్‌ను మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై చూపించబోతున్నట్టు విజువల్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఇక భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్‌లో పవన్ కల్యాణ్ తనదైన స్టైల్లో డైలాగ్స్ చెబుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు.
గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుండగా.. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
A blockbuster background song is ready with Sensational lyrics by Oscar Award winner @boselyricist Garu ❤🔥
This song defines and hails our POWERSTAR’S AURA 🔥🔥
Wait for it.#UstaadBhagatSingh
POWER STAR @PawanKalyan @harish2you @sreeleela14 #RaashiiKhanna @ThisIsDSP… pic.twitter.com/6Ry3aUamT7— L.VENUGOPAL🌞 (@venupro) January 21, 2026
Chiru 158 | చిరంజీవి–బాబీ కొల్లి కాంబోపై అంచనాలు .. కృతి శెట్టి పాత్రపై తొలగిన అనుమానాలు