పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’. సుజీత్ దర్శకుడు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. నేటి నుంచి బ్యాంకాక్‌లో కీలక షెడ్యూల్‌ను మొదలుపెడుతున్నారు. ఇందులో కథానాయిక ప్రియాంక మోహన్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా ముఖ్య ఘట్టాలను తెరకెక్కించబోతున్నారని తెలిసింది.
దీని తర్వాత జనవరి మొదటివారంలో మొదలుపెట్టే చివరి షెడ్యూల్లో పవన్‌కల్యాణ్ జాయిన్ అవుతారని, పదిరోజుల పాటు జరిగే ఈ షూట్లో యాక్షన్ ఎపిసోడ్స్‌ను తెరకెక్కిస్తారని సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, అర్జున్‌దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.