టాలీవుడ్ (Tollywood)స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న తాజా చిత్రం
హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). క్రిష్ (Krish) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో పవన్ టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాలో తన పాత్ర కోసం పవన్ ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ సెషన్ లో కూడా పాల్గొన్నాడు. ఇటీవలే యాక్షన్ కొరియోగ్రఫీ ప్రాక్టీస్ వీడియో ఒకటి రిలీజ్ చేయగా..పవన్ ఎంత కష్టపడుతున్నాడో అర్థమవుతుంది.
ఇదిలా ఉంటే ఓ క్రేజీ గాసిప్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే పవన్ కల్యాన్ ఓ విషయం పట్ల సంతృప్తికరంగా లేడట. క్రిష్ విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఏర్పాటు చేసిన మొత్తం సెటప్ తో పవన్ ఇంప్రెస్ అయ్యాడట. కానీ సినిమాలో వాడిన కాస్ట్యూమ్స్ విషయం మాత్రం పవన్ కల్యాణ్ ను డిసప్పాయింట్ చేసిందని ఓ వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
ఓ వైపు సినిమా మధ్యయుగ భారతదేశం బ్యాక్ డ్రాప్ కథ కావడం…మరోవైపు సినిమాలోని పాత్రలు కూడా చాలా మోడ్రన్‌గా, కొత్తగా కనిపిస్తున్నాయని..అసలు లుక్ల ఆధారంగానే క్రిష్ కాస్ట్యూమ్స్‌ను ఎక్కువగా డిజైన్ చేశాడని పవన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై క్రిష్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలంటున్నారు అభిమానులు.
హరిహర వీరమల్లులో బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజర్.కాగా టాలీవుడ్ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు.