Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లోనే కాకుండా రాజకీయాలలోను పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేశారు. ఏపీ డిప్యూటీ సీఎంగాను పవన్ కళ్యాణ్ అందరి మన్ననలు చూరగొంటున్నారు. అయితే రాజకీయాలలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ తన ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉన్న పవన్ ఇలా అడుగడుగునా అనారోగ్యానికి గురి కావడం జన సైనికులు, అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. ఇటీవల ఏపీ కేబినెట్ మీటింగ్ ఉదయం పదకొండు గంటలకు స్టార్ట్ కావాల్సి ఉండగా పవన్ ఉదయం పదిన్నరకే చేరుకున్నారు.
మీటింగ్ సమయంలో పవన్ తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడ్డారు. అయితే ఓపిక లేని పవన్ తన క్యాంప్ ఆఫీసుకు తిరిగి వెళ్లిపోవాలని లిఫ్ట్ వద్దకు వెళ్లారు. లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అయ్యే సమయం వరకు కూడా వేయిట్ చేయలేక కాసేపు అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నారట. ఎందుకు పవన్ ఇలా తరచు అనారోగ్యానికి గురవుతున్నారు అనే చర్చ నడుస్తుంది. ఆయనకు స్పాండిలైటిస్ సమస్య కూడా ఉందని, దీనితో చాలా కాలంగా బాధపడుతున్నారట. ఆయన రాజకీయాల్లోకి రాక ముందు సినిమాల్లో ఉన్నప్పటి నుంచే పవన్ కు ఈ సమస్య ఉందని, రాజకీయాల్లోకి వచ్చాక క్షణం తీరిక లేకుండా పవన్ పర్యటిస్తున్న కారణంగా ఆయన అనారోగ్యం బారిన పడుతున్నారని అంటున్నారు.
పవన్ ఆరోగ్యం బాగోలేకపోయిన రాష్ట్ర సచివాలయంలో 16వ ఆర్ధిక సంఘం సభ్యులతో మంత్రి వర్గం కీలకమైన సమావేశం జరిగింది. ఇందులో పవన్ పాల్గొన్నారు. ఆ సమయంలో పవన్ చేతికి సెలైన్ డ్రిప్ కనిపించింది. ఈ పిక్ వైరల్ అవుతుండగా, పవన్ కళ్యాణ్ ఆరోగ్యానికి ఏమైందని అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న కూడా పవన్ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కావడం ఆయన కమిట్మెంట్కి నిదర్శనం అని కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.