‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం పవన్‌కల్యాణ్ ఓ పాట పాడిన విషయం తెలిసిందే. ‘మాట వినాలి గురుడా మాట వినాలి..’ అంటూ సాగే ఈ పాట ఇప్పటికే రెండు తెలుగు రాష్ర్టాల్లో బాగా వైరల్ అవుతోంది. రీసెంట్గా ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీక్వెన్స్‌కు పవన్‌కల్యాణ్ యాక్షన్ కొరియోగ్రఫీ కూడా చేశారట. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు జ్యోతికృష్ణ స్వయంగా తెలియజేశారు. ఈ మూవీలో ఆరు యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయని, వాటిలో కీలకమైన ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను పవన్‌కల్యాణ్ స్వయంగా రూపొందించారని ఆయన తెలిపారు.
20 నిమిషాలు సాగే ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ కానుందని జ్యోతికృష్ణ తెలిపారు. ‘1100మంది పాల్గొన్న ఈ ఎపిసోడ్ కోసం పవన్ చాలా కష్టపడ్డారు. ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్స్‌తో డిస్కస్ చేసి ఈ ఎపిసోడ్‌ని ఆయన డిజైన్ చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు స్టూడియోలో ఈ ఎపిసోడ్‌ని షూట్ చేశాం’ అని జ్యోతికృష్ణ చెప్పారు.
ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌ని మే 9న విడుదల చేసేందుకు మేకర్స్ శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీడియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహీ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్, మనోజ్ పరమహంస, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సమర్పణ: ఎ.ఎం.రత్నం, నిర్మాత: ఎ.దయాకర్, నిర్మాణం: మెగా సూర్య ప్రొడక్షన్స్.