Kangana Ranaut | టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్ కల్యాణ్ తొలిసారి హరిహరవీరమల్లు ప్రమోషన్స్ బాధత్యను తీసుకున్న విషయం తెలిసిందే. ఇదివరకెన్నడూ లేని విధంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. ఓ హిందీ మీడియాతో జరిపిన చిట్ చాట్ సెషన్లో పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌పై స్పందిస్తూ రిప్లై ఇచ్చింది బాలీవుడ్ భామ కంగనరనౌత్. బాలీవుడ్ హీరోయిన్‌తో నటించాల్సి వస్తే.. ఎవరికి ఛాన్స్ ఇస్తారని పవన్ కల్యాణ్‌ను అడిగారు. దానికి కంగనారనౌత్ పేరు చెప్పాడు పవన్ కల్యాణ్.
ఎమర్జెన్సీలో కంగనారనౌత్ ఇందిరాగాంధీ పాత్రను పోషించిన తీరు బాగుంటుందని.. నేను ఖచ్చితంగా కంగనారనౌత్ లాంటి బలమైన వ్యక్తితో కలిసి పనిచేస్తానంటూ చెప్పాడు. ఇక ఈ కామెంట్స్ కాస్తా వైరల్ అయి కంగనారనౌత్ దాకా వెళ్లాయి. పవన్ కల్యాణ్ కామెంట్స్‌పై ఇన్స్టాగ్రామ్ స్టోరీలో స్మైలింగ్ (ప్రేమతో నవ్వుతూ), నమస్తే ఎమోజీలతో సమాధానమిచ్చింది. ఇది కాస్తా నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
పవన్ కల్యాణ్, కంగనారనౌత్.. ఇద్దరూ కూడా క్రిష్ దర్శకత్వంలో పనిచేశారని తెలిసిందే. అయితే ఈ ఇద్దరు కలిసి మాత్రం నటించలేదు. మరి పవన్ కల్యాణ్ కామెంట్స్, కంగనా రియాక్షన్‌తో ఈ ఇద్దరు కలిసి ఓ సినిమా చేయాలని కోరుకుంటున్నారు అభిమానులు, ఫాలోవర్లు. ఈ క్రేజీ కాంబో సిల్వర్ స్క్రీన్‌పై వస్తుందా.. లేదా.. ? అనేది కాలానికే వదిలేయాలి.
Sathi Leelavathi Teaser | మెగా కోడలి మూవీ టీజర్.. విడాకులు అడిగితే మొగుడ్ని కొట్టి కట్టేసింది..!
90s Re Union | నైంటీస్ స్టార్స్ రీయూనియన్… సీనియర్ హీరో, హీరోయిన్స్ సందడి మాములుగా లేదు..!