Pawan Kalyan | పవన్ కళ్యాణ్, అన్నా లెజీనోవా ముద్దుల తనయుడు మార్క్ శంకర్ ఇటీవల పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్న విషయం తెలిసిందే. సింగపూర్‌లోని స్కూల్లో తాను చదువుకుంటుండగా, ఆ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదం వలన మార్క్ శంకర్‌కి గాయాలయ్యాయి. కొంత కోలుకున్నాక కుమారుడిని హైదరాబాద్‌కి తీసుకొచ్చారు. ఇక అప్పటి నుండి ఇక్కడే ఉంటున్న మార్క్ ఇప్పుడు స్కూల్‌కి వెళ్లేందుకు సిద్ధమయ్యాడట. స్కూల్స్ ప్రారంభమైన నేపథ్యంలో మార్క్ శంకరును ఇక్కడే చదివించాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలో పటాన్ చెరులోని ఇక్రిశాట్ ను పవన్ కళ్యాణ్ సందర్శించారు. కుమారుడి అడ్మిషన్ కోసం ఇక్రిసాట్ కి వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడి టీచర్లతో మాట్లాడారు. అదే విధంగా ఇంటర్నేషన్ స్కూల్ లో సిలబస్, విద్యార్థులకు సదుపాయాలు, వసతులు మొదలైన విషయాల గురించి పవన్ అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఇక ఇదే పాఠశాలలో మహేష్ బాబు పిల్లలు చదివారు. అల్లు అర్జున్ పిల్లలు కూడా ఈ స్కూల్లోనే చదువుతున్నట్టు తెలుస్తుంది.
అయితే పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.. మరోవైపు ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నట్టుగా ఎవరికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మీడియాని కూడా లోపలికి రానివ్వలేదు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెట్స్‌లో ఇటీవలే పవన్ అడుగుపెట్టారు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాల షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పూర్తి కాన్సన్ట్రేషన్ ఉస్తాద్ భగత్ సింగ్ పైనే పెట్టాడు.పవన్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూన్ 12న విడుదల కావలసి ఉండగా, వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. జూలైలో రిలీజ్ అవుతుందని అంటున్నారు. మరోవైపు ఓజీ చిత్రాన్ని సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నారట.