పవన్‌కల్యాణ్ బత్తుల హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘పురుషః’. వీరు వులవల దర్శకుడు. సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్, రాయంచ కొక్కుర ప్రధాన పాత్రధారులు. బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల వంటి సీనియర్స్‌తో కలిసి నటించడం వల్ల ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నానని, ఈ వేసవిలో పర్ఫెక్ట్ ఫ్యామి లీ ఎంటర్టైనర్గా అలరిస్తుందని హీరో బత్తుల పవన్‌కల్యాణ్ తెలిపారు.
సప్తగిరి, రాజ్‌కుమార్ పండించిన కామెడీ హైలైట్‌గా నిలుస్తుందని, ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే సినిమా ఇదని దర్శకుడు వీరు వులవల అన్నారు. తమ కుమారుడిని ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం చేయడం గర్వంగా ఉందని, అతనికి ప్రేక్షకుల ఆశీస్సులు కావాలని నిర్మాత బత్తుల కోటేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.