టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ ( Bandla Ganesh ) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) తో మరో సినిమా చేస్తానని కొన్ని నెలల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే నెలలు గడిచిపోతున్న దీనిపై ఇప్పటివరకు గణేశ్ నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. బండ్ల గణేశ్ ఓ కథను గుర్తించగా తర్వాత ఆ స్టోరీ అంతగా నచ్చలేదట.
ప్రస్తుతం మంచి కథను సిద్దం చేసే పనిలో బండ్ల గణేశ్ ఉన్నట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్. ఇందులో భాగంగా బండ్ల గణేశ్ పలువురు యువ రచయితలను కూడా సంప్రదిస్తూ బిజీబిజీగా ఉన్నారట. అంతేకాదు పవన్ కల్యాణ్ కొత్త సినిమాను హ్యాండిల్ చేయగల పర్ఫెక్ట్ దర్శకుడి వేటలో కూడా ఉన్నట్టు సినీ జనాలు తెగ చర్చించుకుంటున్నారు. ఒక్కసారి గుడ్ స్టోరీ దొరికి, డైరెక్టర్ ఫిక్సవడమే తరువాయి బండ్ల గణేశ్-పవన్ కల్యాణ్ సినిమా సెట్స్ పైకి వెళ్లడం ఖాయమైనట్టే.
బండ్ల గణేశ్ ఎలాంటి స్టోరీని పవన్ కల్యాణ్ కు సెట్ చేస్తాడు..మరి పవన్ ను ఆ కథ ఇంప్రెస్ చేస్తుందా..? లేదా అనేది తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
ఇవి కూడా చదవండి..
Karan Johar Fear| భయపడుతున్న బాలీవుడ్ దర్శకుడు
Sukumar | తండ్రి పేరు మీద స్కూల్ ప్రారంభించిన సుకుమార్
దోస్తి వీడియో సాంగ్ ఐడియా ఎవరిదో చెప్పిన రాజమౌళి
Vedhika Kumar look | వేదిక స్టన్నింగ్ లుక్కు నెటిజన్లు ఫిదా….వీడియో