Parineeti-Raghav Chadha | బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) వివాహం ఇటీవలే అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ ఉదయ్‌పూర్ (Udaipur)లోని లీలా ప్యాలెస్ (Leela Palace)లో పంజాబీ సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలను పరిణీతి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా, పెళ్లి అనంతరం ఉదయ్‌పూర్‌లో వీరి రిసెప్షన్ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా రిసెప్షన్‌కు సంబంధించిన ఫొటోలను పరిణీతి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోల్లో పరిణీతి పింక్ కలర్ శారీ, అన్‌కట్ డైమండ్స్ నెక్లెస్ ధరించి మెరిసిపోయారు. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.
రాఘవ్-పరిణీతి వివాహం గత నెల (సెప్టెంబర్) 24వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. బంధుమిత్రులు, స్నేహితుల సమక్ష్యంలో రాఘవ్ తన ప్రేయసి పరిణీతి మెడలో మూడుముళ్లు వేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం సహా పలువురు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన పెళ్లి ఫొటోలు, వీడియోలను కొత్త జంట సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Parineeti Raghav1
परिणीति चोपड़ा और राघव चड्ढा के रॉयल रिसेप्शन की झलक देखिए #ParineetiChopra #raghavchadha #raghavparineeti pic.twitter.com/FCJg1aJKZW
— Saibaba (@Sandeep42119721) October 20, 2023
Also Read..
Fitness Influencer | అనుమానాస్పద స్థితిలో ప్రముఖ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ మృతి
Russian YouTuber | ఢిల్లీలో రష్యన్ యూట్యూబర్‌కు వేధింపులు.. అందంగా ఉన్నావు అంటూ వెంటపడిన ఆకతాయి