Russian YouTuber | ఢిల్లీలో రష్యన్ యూట్యూబర్‌కు వేధింపులు.. అందంగా ఉన్నావు అంటూ వెంటపడిన ఆకతాయి
Russian YouTuber | దేశ రాజధాని ఢిల్లీలో ఓ రష్యన్ యూట్యూబర్ (Russian YouTuber)కు చేదు అనుభవం ఎదురైంది. ఓ ఆకతాయి ఆమె వెంట పడి ‘నువ్వు చాలా అందంగా ఉన్నావు..’ అంటూ వేధింపులకు గురిచేశాడు.
Russian YouTuber | దేశ రాజధాని ఢిల్లీలో ఓ రష్యన్ యూట్యూబర్ (Russian YouTuber)కు చేదు అనుభవం ఎదురైంది. ఓ ఆకతాయి ఆమె వెంట పడి ‘నువ్వు చాలా అందంగా ఉన్నావు..’ అంటూ వేధింపులకు గురిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
రష్యాకు చెందిన ఓ యువతి ‘కోకో ఇన్ ఇండియా’ (Koko in India) అనే యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తోంది. మన దేశంలోని పలు ప్రముఖ ప్రాంతాలను సందర్శించి.. వీడియోలు చిత్రీకరించి వాటిని తన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే ఇటీవలే ఢిల్లీ (Delhi)లో రద్దీగా ఉండే సరోజినీ నగర్ మార్కెట్ (Sarojini Nagar Market)ను సందర్శించింది. అక్కడ ఆమె ప్రత్యక్ష ప్రసారం చేస్తుండగా.. ఓ ఆకతాయి ఆమె వెంట పడ్డాడు. అనుచిత వ్యాఖ్యలతో యూట్యూబర్‌ను ఇబ్బందులకు గురి చేశాడు. మీ వీడియోలు నిత్యం చూస్తూనే ఉంటానని.. మీతో స్నేహం చేయాలనుకుంటున్నా అంటూ మాటకలిపాడు. మీరు చాలా అందంగా ఉంటారు అంటూ అసభ్యకర రీతిలో మాట్లాడాడు. అతడి ప్రవర్తకు ఒకింద ఇబ్బందికి గురైన సదరు యూట్యూబర్.. ఎంతో ఓపిగ్గా అతడికి సమాధానమిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు సదరు యువకుడిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆ ఆకతాయి తరఫున యూట్యూబర్‌కు క్షమాపణలు చెబుతున్నారు.
Also Read..
Justin Trudeau | భారత్ చర్యలతో లక్షలాది మందికి ఇబ్బందులు.. మరోసారి అక్కసు వెళ్లగక్కిన ట్రూడో
Israel-Hamas War | మానవతా కోణంలో ఇద్దరు అమెరికన్ బందీలను విడిచిపెట్టిన హమాస్
India – Canada | దౌత్యవేత్తల తొలగింపు.. కెనడాకు మద్దతు నిలిచిన అమెరికా, బ్రిటన్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

