Justin Trudeau | భారత్ చర్యలతో లక్షలాది మందికి ఇబ్బందులు.. మరోసారి అక్కసు వెళ్లగక్కిన ట్రూడో
Justin Trudeau | కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) మరోసారి భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కారు. భారత్ తన చర్యలతో లక్షలాది మందిని ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు.
Justin Trudeau | కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) మరోసారి భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కారు. భారత్ తన చర్యలతో లక్షలాది మందిని ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. భారత్‌లోని కెనడా దౌత్యవేత్తల ఉపసంహరణ అనంతరం శుక్రవారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. దౌత్యవేత్తల తరలింపుతో భారత్‌లో కెనడా వీసా, కాన్సులార్ సేవలకు అంతరాయం ఏర్పడి పర్యాటక, వాణిజ్య రంగాల్లో అడ్డంకులు ఎదురవుతున్నాయని అన్నారు. కెనడాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులూ ఇబ్బందుల పాలవుతున్నారంటూ వ్యాఖ్యానించారు.
‘దౌత్యసంబంధాల ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా భారత్ వ్యవహరిస్తోంది. ఇరు దేశాల్లో ఉంటున్న లక్షలాది మందిని ఇక్కట్లపాలు చేస్తోంది. కెనడాలో భారత మూలాలున్న అనేక మంది పౌరుల గురించి నాకు ఆందోళనగా ఉంది’ అని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించారు. కాగా, కెనడా జనాభాలో దాదాపు 5 శాతం.. అంటే సుమారు 20 లక్షల మంది భారత సంతతి వారు ఉన్నారు. అంతేకాకుండా, కెనడాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులు సుమారు 40 శాతం.
ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ ఇటీవలే కెనడా (Canada ) ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ట్రూడో ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే తమ దేశంలోని 41మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని భారత్ ఆదేశించింది. ఈ మేరకు కెనడాకు భారత్ డెడ్‌లైన్ పెట్టింది. దీంతో కేంద్రం విధించిన డెడ్‌లైన్ ముగియడంతో భారత్‌లోని తమ దౌత్యవేత్తలను తరలించినట్లు కెనడా గురువారం వెల్లడించింది. 41 మంది కెనడా దౌత్యవేత్తలు తమ కుటుంబంతో సహా భారత్‌ను వీడినట్లు తెలిపింది. ఆ తర్వాత కొద్దిసేపటికే భారత్‌లో పర్యటిస్తున్న తమ దేశ పౌరులకు కీలక హెచ్చరికలు చేసింది. భారత్‌లోని పలు నగరాల్లో (Indian Cities) ఉన్న కెనడా వాసులు అప్రమత్తంగా ఉండాలని అడ్వైజరీ జారీ చేసింది.
ఇటీవలే చోటు చేసుకున్న పరిణామాలతో భారత మీడియా, సామాజిక మాధ్యమాల్లో కెనడాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అడ్వైజరీలో పేర్కొంది. ఈ క్రమంలోనే కెనడా పౌరులపై బెదిరింపులు, వేధింపులు జరగొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. అందువల్ల దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాలతోపాటు బెంగళూరు, చండీగఢ్, ముంబై నగరాల్లో ఉన్న కెనడియన్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రద్దీ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఎవరూ తమ వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించింది.
Also Read..
Gaganyaan Mission: గగన్‌యాన్ టీవీ-డీ1 ప్రయోగం సక్సెస్.. బంగాళాఖాతంలో దిగిన క్రూ మాడ్యూల్
Rohit Sharma: కోహ్లీ, రాహుల్‌తో రోహిత్ ఫోటో.. వైరల్‌గా మారిన ఇన్‌స్టా పిక్
Israel-Hamas War | గాజాపై బాంబుల వర్షం.. సేఫ్ జోన్లపైనా ఇజ్రాయెల్ సైన్యం రాకెట్ దాడులు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

