ముంబై: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను పోస్టు చేశాడు. కోహ్లీ, రాహుల్‌తో ఉన్న ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఆ ఫోటోకు అతను టుగెదర్ అన్న క్యాప్షన్ ఇచ్చాడు. తాజాగా జరుగుతున్న వరల్డ్‌కప్‌లో ఇండియా ఓటమి లేకుండా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ కొట్టిన విషయం తెలిసిందే. అది అతనికి వన్డేల్లో 48వ సెంచరీ కావడం విశేషం. కలిసికట్టుగా జట్టు రాణిస్తున్న తీరు పట్ల కెప్టెన్ రోహిత్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డుకు చేరువలో కోహ్లీ నిలిచాడు. వన్డేల్లో సచిన్ పేరిట ఉన్న 49 సెంచరీలకు సమీపంగా కోహ్లీ చేరుకున్నాడు.