India – Canada | దౌత్యవేత్తల తొలగింపు.. కెనడాకు మద్దతు నిలిచిన అమెరికా, బ్రిటన్
India - Canada | సిక్కు వేర్పాటువాది, ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్యతో భారత్- కెనడా (India - Canada) మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదిరిన వేళ.. అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్ దేశాలు కెనడాకు మద్దతుగా నిలిచాయి.
India – Canada | సిక్కు వేర్పాటువాది, ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్యతో భారత్- కెనడా (India – Canada) మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదిరిన వేళ.. అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్ దేశాలు కెనడాకు మద్దతుగా నిలిచాయి. భారత్‌లోని 41 మంది కెనడా దౌత్యవేత్తలకు, వారి కుటుంబాలకు ఉండే అంతర్జాతీయ దౌత్యపరమైన రక్షణలను ఉపసంహరిస్తామని భారత్ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో ఆ దౌత్య సిబ్బందిని ఉపసంహరించుకుంటున్నట్టు కెనడా శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై అమెరికా, బ్రిటన్ దేశాలు స్పందించాయి. ఈ విషయంలో కెనడాకు మద్దతుగా నిలిచాయి.
ఈ మేరకు దౌత్యవేత్తల సంఖ్య తగ్గించాలంటూ కెనడాను ఒత్తిడి చేయొద్దని భారత ప్రభుత్వాన్ని కోరాయి. ‘దౌత్యసిబ్బంది సంఖ్య తగ్గించుకోవాలన్న భారత్ డిమాండ్ మేరకు కెనడా దౌత్యవేత్తల తరలింపు మాకు ఆందోళన కలిగిస్తోంది’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మ్యాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు. ‘క్షేత్రస్థాయిలో విభేదాలను పరిష్కరించేందుకు దౌత్యవేత్తలు అవసరం. దౌత్య సిబ్బందిని తగ్గించాలని పట్టుబడవద్దని మేము భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే నిజ్జర్ హత్య విషయంలో కెనడా దర్యాప్తునకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దౌత్య సంబంధాలపై 1961 వియన్నా ఒప్పందం ప్రకారం భారత్ తన బాధ్యతలను నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. ‘కెనడా దౌత్యవేత్తలు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలంటూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో మేం ఏకీభవించడం లేదు. కెనడా దౌత్యవేత్తల ఏకపక్ష తొలగింపు వియన్నా ఒప్పంద సూత్రాలకు అనుగుణం కాదు’ అని బ్రిటన్ వెల్లడించింది.
ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ ఇటీవలే కెనడా (Canada ) ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ట్రూడో ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే తమ దేశంలోని 41మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని భారత్ ఆదేశించింది. ఈ మేరకు కెనడాకు భారత్ డెడ్‌లైన్ పెట్టింది. దీంతో కేంద్రం విధించిన డెడ్‌లైన్ ముగియడంతో భారత్‌లోని తమ దౌత్యవేత్తలను తరలించినట్లు కెనడా శుక్రవారం వెల్లడించింది. 41 మంది కెనడా దౌత్యవేత్తలు తమ కుటుంబంతో సహా భారత్‌ను వీడినట్లు తెలిపింది. ఆ తర్వాత కొద్దిసేపటికే భారత్‌లో పర్యటిస్తున్న తమ దేశ పౌరులకు కీలక హెచ్చరికలు చేసింది. భారత్‌లోని పలు నగరాల్లో (Indian Cities) ఉన్న కెనడా వాసులు అప్రమత్తంగా ఉండాలని అడ్వైజరీ జారీ చేసింది.
ఇటీవలే చోటు చేసుకున్న పరిణామాలతో భారత మీడియా, సామాజిక మాధ్యమాల్లో కెనడాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అడ్వైజరీలో పేర్కొంది. ఈ క్రమంలోనే కెనడా పౌరులపై బెదిరింపులు, వేధింపులు జరగొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. అందువల్ల దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాలతోపాటు బెంగళూరు, చండీగఢ్, ముంబై నగరాల్లో ఉన్న కెనడియన్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రద్దీ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఎవరూ తమ వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించింది.
Also Read..
Justin Trudeau | భారత్ చర్యలతో లక్షలాది మందికి ఇబ్బందులు.. మరోసారి అక్కసు వెళ్లగక్కిన ట్రూడో
Israel-Hamas War | మానవతా కోణంలో ఇద్దరు అమెరికన్ బందీలను విడిచిపెట్టిన హమాస్
Rohit Sharma: కోహ్లీ, రాహుల్‌తో రోహిత్ ఫోటో.. వైరల్‌గా మారిన ఇన్‌స్టా పిక్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

