Bengaluru Traffic | సిలికాన్ సిటీలో ట్రాఫిక్ కష్టాలు.. బైక్‌పై వెళ్తూ ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తున్న యువతి.. VIDEO
Bengaluru Traffic | సిలికాన్ వ్యాలీ (Silicon Valley)గా పేరుగాంచిన బెంగళూరు మహానగరంలో ట్రాఫిక్ కష్టాల (Bengaluru Traffic) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఓ యువతి రద్దీగా ఉన్న రోడ్లపై బైక్‌పై వెళ్తూ ల్యాప్‌టాప్‌లో పనిచేసుకుంటున్న (Woman Working On Laptop) వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
Bengaluru Traffic | సిలికాన్ వ్యాలీ (Silicon Valley)గా పేరుగాంచిన బెంగళూరు మహానగరంలో ట్రాఫిక్ కష్టాల (Bengaluru Traffic) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రోజురోజుకూ నగరంలో ట్రాఫిక్ పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థుల బాధలు వర్ణనాతీతం. ప్రపంచంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో రెండో స్థానంలో నిలిచిన బెంగళూరులో 2-3 కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతోంది. ఇక సెలవుల సమయంలో చెప్పాల్సిన పనేలేదు. సొంతూళ్లకు వెళ్లే నగర వాసులు సొంత వాహనాలతో రోడ్లపైకి రావడంతో మహానగరం మొత్తం ఎక్కిడకక్కడ స్తంభించిపోతుంటుంది.
తాజాగా ఓ యువతి రద్దీగా ఉన్న రోడ్లపై బైక్‌పై వెళ్తూ ల్యాప్‌టాప్‌లో పనిచేసుకుంటున్న (Woman Working On Laptop) వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. బైక్‌పై వెనుక కూర్చున్న యువతి ల్యాప్‌టాప్ ఓపెన్ చేసుకుని తన పనిచేసుకుంటూ కనిపించింది. ఈ వీడియో రెడ్డిట్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోకు ‘బెంగళూరులో మాత్రమే ఇలా..’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
కాగా, ఈ సిలికాన్ సిటీలో ట్రాఫిక్ కష్టాలకు అద్దం పట్టే ఘటనలు ఇప్పటికే సోషల్ మీడియాలో అనేకం వెలుగులోకి వచ్చాయి. సుదీర్ఘ ట్రాఫిక్ జామ్‌ను తప్పించుకునేందుకు అనేకమంది నగర వాసులు మెట్రో రైలు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను అనుసరిస్తున్నారు. నగరంలోని 95 శాతం మంది వాహనాల యజమానులు కూడా ఇదే చెబుతున్నారని ఇటీవలే స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
Also Read..
Fitness Influencer | అనుమానాస్పద స్థితిలో ప్రముఖ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ మృతి
Russian YouTuber | ఢిల్లీలో రష్యన్ యూట్యూబర్‌కు వేధింపులు.. అందంగా ఉన్నావు అంటూ వెంటపడిన ఆకతాయి
India – Canada | దౌత్యవేత్తల తొలగింపు.. కెనడాకు మద్దతు నిలిచిన అమెరికా, బ్రిటన్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

