Fitness Influencer | అనుమానాస్పద స్థితిలో ప్రముఖ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ మృతి
Fitness Influencer | న్యూజిలాండ్ బాడీ బిల్డర్ (New Zealand body-builder), ప్రముఖ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ (Fitness Influencer ) రేచెల్ చేజ్ (Raechelle Chase) అనుమానాస్పద స్థితిలో మరణించారు.
Fitness Influencer | న్యూజిలాండ్ బాడీ బిల్డర్ (New Zealand body-builder), ప్రముఖ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ (Fitness Influencer ) రేచెల్ చేజ్ (Raechelle Chase) అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె ధృవీకరించింది. చేజ్ మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు. న్యూజిలాండ్ పోలీసులు ఆమె మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఐదుగురు పిల్లల తల్లి అయిన చేజ్‌కు ఫేస్బుక్లో 1.4 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో నిత్యం ఫిట్నెస్ మీద, ఒంటరి తల్లిగా ఉండటంపై స్ఫూర్తిదాయకమైన పోస్ట్‌లు చేస్తుంటారు.
చిన్న వయస్సు నుంచే బాడీ బిల్డింగ్‌లో సత్తా చాటుతూ వస్తున్న రేచెల్ చేజ్.. స్వదేశంలో జరిగిన అనేక పోటీల్లో గెలుపొందింది. 2011లో లాస్ వేగాస్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ఒలింపియా బాడీ – బిల్డింగ్ పోటీల్లో న్యూజిలాండ్ తరఫున పాల్గొని మొదటి మహిళగా రికార్డుకెక్కింది. ఇక రేచెల్.. క్రిస్ చేజ్‌ను వివాహం చేసుకుంది. ఈ జంటకు ఐదుగురు పిల్లలు. అయితే భర్తతో విబేధాల కారణంగా తన 14 సంవత్సరాల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ.. ఫిబ్రవరి 2015లో విడాకులు తీసుకుంది. ఇక అప్పటి నుంచి రేచెల్ తన ఐదుగురి పిల్లల బాగోగులు చూసుకుంటూ ఒంటరిగానే జీవిస్తోంది. అయితే, ఆమె తన విడాకులకు దారితీసిన విషపూరిత సంబంధం గురించి 2016లో భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేసింది. విడాకుల సమయంలో తాను 9 నెలల గర్భవతినని.. ఆ సమయంలో పిల్లలను ఒంటరిగా ఎంతో ఆత్మవిశ్వాసంతో పెంచానని చెప్పుకొచ్చింది.
Also Read..
Russian YouTuber | ఢిల్లీలో రష్యన్ యూట్యూబర్‌కు వేధింపులు.. అందంగా ఉన్నావు అంటూ వెంటపడిన ఆకతాయి
India – Canada | దౌత్యవేత్తల తొలగింపు.. కెనడాకు మద్దతు నిలిచిన అమెరికా, బ్రిటన్
Israel-Hamas War | మానవతా కోణంలో ఇద్దరు అమెరికన్ బందీలను విడిచిపెట్టిన హమాస్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

