స్వీయ నిర్మాణంలో పార్ధా గోపాల్ హీరోగా నటించిన చిత్రం ‘డైమండ్ డెకాయిట్’. సూర్య జి యాదవ్ దర్శకత్వం వహించారు. మేఘనా రెడ్డి కథానాయిక. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ట్రైలర్ను వీక్షించి చిత్రబృందాన్ని అభినందించారు.
ప్రతీ కుటుంబానికి కనెక్ట్ అయ్యే కథ ఇదని, మహిళలకు నాలుగు షోలను ఉచితంగా ప్రదర్శిస్తామని, మహిళా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలని మేకర్స్ కోరారు. ఈ చిత్రానికి సంగీతం: పీఆర్, నిర్మాత: పార్ధా గోపాల్, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: సూర్య జి యాదవ్.