ఆర్ఆర్ఆర్ (RRR)తో తెలుగు సినిమా స్థాయిని మరోసారి గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర చాటిచెప్పాడు ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో అరుదైన పురస్కారం చేరింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు అద్బుతమైన స్కోర్ అందించిన లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణిని లాస్ ఏంజెల్స్ ఫిలిమ్స్ క్రిటిక్స్ అసోసియేషన్ బెస్ట్ మ్యూజిక్/స్కోర్ విభాగంలో విన్నర్‌గా ప్రకటించింది.
ఆర్ఆర్ఆర్ ఇప్పటికే సటర్న్ అవార్డ్స్ (ప్రతిష్టాత్మక అమెరికన్ అవార్డు)లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డు అందుకుంది . ఆ తర్వాత ఇదే కేటగిరీలో సన్‌సెట్ సర్కిల్ అవార్డు గెలుచుకుంది. రీసెంట్గా జపాన్‌లో అత్యధిక గ్రాస్ సాధించిన ఇండియన్ మూవీ ముత్తు సినిమాపై ఉన్న కార్డును అధిగమించింది ఆర్ఆర్ఆర్. తాజా పురస్కారంతో మరోసారి వార్తల్లో నిలిచింది.
ఈ ఎపిక్ డ్రామా చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ (Ram Charan) నటించగా.. ఎన్టీఆర్ (Jr NTR) కొమ్రంభీం పాత్రలో నటించాడు.అలియాభట్, అజయ్ దేవ్గన్, శ్రియాశరణ్, ఒలివియా మొర్రీస్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకుపైగా కలెక్షన్లు వసూళ్లు చేసింది.
Best Music/Score, Winner: M.M. Keeravani, RRR #LAFCA
— Los Angeles Film Critics Association (@LAFilmCritics) December 11, 2022