తెలంగాణ నేపథ్యంలో పళ్ళబురుసు.. టూత్ బ్రెష్‌ని తెలంగాణ గ్రామీణ మాండ
లికంలో కొందరు ‘పళ్ళ బురుసు’ అని పిలుస్తుంటరు. ఇప్పుడు అదే పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్నది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, ఆదిత్య పిట్టి, వివేక్ కృష్ణన్ కలిసి నిర్మిస్తున్నారు. ‘బలగం’ఫేం సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్ ప్రధాన పాత్రధారులు.
లికంలో కొందరు ‘పళ్ళ బురుసు’ అని పిలుస్తుంటరు. ఇప్పుడు అదే పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్నది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, ఆదిత్య పిట్టి, వివేక్ కృష్ణన్ కలిసి నిర్మిస్తున్నారు. ‘బలగం’ఫేం సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్ ప్రధాన పాత్రధారులు. ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ శుక్రవారం మేకర్స్ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సంస్కృతి, ప్రాంతీయతను ప్రతిబింబించే వినోదభరితమైన కామెడీ డ్రామా ఇదని ఫస్ట్‌లుక్ పోస్టర్ చెబుతున్నది.
జిల్లా కోర్ట్ ఆవరణలో పెద్ద టూత్‌బ్రెష్‌ని త్రాసులా ఉంచి, దానిపై అటొకరు ఇటొకరు ఎడమొహం పెడమొహంలా కూర్చున్న తండ్రీకొడుకుల్ని ఈ పోస్టర్లో చూడొచ్చు. ఈ వినూత్నమైన విజువల్ సినిమా కథపై ఆసక్తిని రేకెత్తిస్తున్నది. సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్ తండ్రీకొడుకులుగా నటిస్తుండగా, ప్రజ్వల్, గోమతి, కిరణ్ మాచా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: వినోద్ కె.బంగారి, సంగీతం: పవన్ సీహెచ్, సమర్పణ: అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

