సినిమా సినిమాకు విభిన్నమైన కథలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు మారుతి (maruthi). వరస విజయాలతో పాటు అప్పుడప్పుడూ మంచి రోజులు వచ్చాయి లాంటి సినిమాలతో ఈయన జోరుకు బ్రేకులు కూడా పడుతుంటాయి. ఆయన నుంచి ఇప్పుడొస్తున్న సినిమా పక్కా కమర్షియల్ (Pakka commercial). ప్రతీ రోజు పండగే లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత విలక్షణ దర్శకుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో సక్సెస్ ఫుల్ బ్యానర్లుగా అందరి మన్ననలు అందుకుంటూ మందుకు సాగుతున్న జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ కలిసి మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీవాసు (Bunny Vasu) నిర్మాతగా మ్యాచో హీరో గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు మారుతి. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. తాజాగా పక్కా కమర్షియల్ టీజర్ విడుదలైంది. ‘ఎవరికీ చూపిస్తున్నారు సార్ మీ విలనిజం.. మీరు ఇప్పుడు చేస్తున్నారు నేను ఎప్పుడో చూసి చేసి వదిలేసాను..’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. టీజర్ లోనే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతీ రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ – బన్నీవాసు – కాంబినేషన్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. గతంలో ఈ బ్యానర్స్ నుంచే దర్శకుడు మారుతి భలేభలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే వంటి బ్లాక్ బస్టర్స్ అందించారు.
ప్రతీ రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. గోపిచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా పక్కా కమర్షియల్ వస్తుంది. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. గతంలో జిల్, ఆక్సిజన్ సినిమాల్లో కలిసి నటించారు గోపీచంద్, రాశీ ఖన్నా. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
SKN సహ నిర్మాత. మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు. డిసెంబర్లో సినిమా విడుదల కానుంది. పక్కా కమర్షియల్ అని పేరుకు తగ్గట్లుగానే సినిమా కూడా పక్కా కమర్షియల్‌గా ఉండబోతుంది. టీజర్ చూస్తుంటేనే ఈ విషయంపై క్లారిటీ వచ్చేస్తుంది. మరి ఈ సినిమాతో గోపీచంద్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bad Luck Sakhi video song | పల్లెటూరి సరదాలతో ‘బ్యాడ్ లక్ సఖి ‘ వీడియో సాంగ్
Malaika Arora | మలైకా వల్ల అర్జున్ కపూర్ హ్యాపీగా ఉంది అప్పుడేనట..!
Laddunda lyrical promo | దరువేస్తూ బంగార్రాజు ‘లడ్డుందా’ సాంగ్ ప్రోమో
Rana: ఒక్క పోస్ట్‌తో ముగ్గురు సెలబ్రిటీలకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన రానా