గురువారం 04 జూన్ 2020
Cinema - Mar 04, 2020 , 18:09:38

కొత్త టీజర్ తో అలరిస్తున్న ‘కుమారి 21ఎఫ్’ జోడి

కొత్త టీజర్ తో అలరిస్తున్న ‘కుమారి 21ఎఫ్’ జోడి

కుమారి 21ఎఫ్ చిత్రంలో కలిసి సందడి చేసిన రాజ్ తరుణ్, హెబ్బాపటేల్ మరోసారి ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు వస్తున్నారు. హెబ్బాపటేల్, రాజ్ తరుణ్, మాళివిళ నాయర్ కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం ‘ఓరేయ్ బుజ్జిగా..’. గుండెజారి గల్లంతయ్యిందే ఫేం విజయ్  కుమార్ కొండ దర్శకుడు. ఈ సినిమా టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే ప్రేమ, కామెడీ సన్నివేశాలతో సాగే టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్. logo