సత్యదేవ్ (Satyadev), తమన్నా (Tamannah) కాంబినేషన్లో వస్తున్న చిత్రం గుర్తుందా శీతాకాలం (Gurtunda Seetakalam). నాగశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ డిసెంబర్ 9న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మిల్కీ బ్యూటీ తమన్నా మీడియాతో చిట్ చాట్ చేసింది. సత్యదేవ్ తో నటించడం చాలా సంతోషంగా ఉందంది తమన్నా.
సత్యదేవ్ నటించిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా చూసిన తర్వాత ఆయన యాక్టింగ్ చాలా సహజంగా అనిపించింది. అప్పుడే సత్యదేవ్‌తో సినిమా చేయాలని ఆసక్తి కలిగింది. ఈ సినిమా ఆఫర్ రావడంతో సత్యదేవ్‌తో నటించాలన్న కోరిక తీరిందని చెప్పుకొచ్చింది. సినిమాలు పోలిన సినిమాలుంటాయని, కానీ ఏదో ఒక కొత్త పాయింట్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా కొత్త భావోద్వేగాలు, కొత్త పాయింట్‌ను మూవీ లవర్స్ కు చెప్పబోతున్నట్టు పేర్కొంది.
నేనిప్పటివరకు యాక్టర్ కమ్ డైరెక్టర్ అయిన వారితో ఎప్పుడూ సినిమాలు చేయలేదు. కానీ నాగశేఖర్ (డైరెక్టర్) నటుడు కూడా కావడంతో పాత్రలు, ఎమోషన్స్ ను పర్ఫెక్ట్గా అర్థం చేసుకొని మాతో చేయించాడని చెప్పుకొచ్చింది. గుర్తుందా శీతాకాలం కన్నడలో సూపర్ హిట్‌గా నిలిచిన లవ్ మాక్‌టెయిల్ చిత్రానికి తెలుగు రీమేక్‌గా వస్తోంది. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు.
మీడియాతో తమన్నా చిట్ చాట్ స్టిల్స్..
Vibrant Milky Beauty @tamannaahspeaks At Media Interaction Today 📸 #GurtundaSeetakalamOnDec9th pic.twitter.com/kaTsW6ImlH
— BA Raju's Team (@baraju_SuperHit) December 6, 2022
Milky Beauty @tamannaahspeaks #Tamannaah At #GurthundaSeethakalam Promotions #GurtundaSeetakalamOnDec9th pic.twitter.com/va0WSyjPmp
— BA Raju's Team (@baraju_SuperHit) December 6, 2022
Read Also :Mrunal Thakur | ఈ ఏడాది మృణాళ్ ఠాకూర్‌కు చాలా స్పెషల్.. ఎందుకంటే..?
Read Also :Narappa | మూవీ లవర్స్ గెట్ రెడీ.. థియేటర్లలో వెంకటేశ్ నారప్ప
Read Also :Mukhachitram | విశ్వక్సేన్ ముఖచిత్రం కొత్త అప్డేట్