Jana Nayagan | కోలీవుడ్ స్టార్ యాక్టర్ దళపతి విజయ్ (Thalapathy Vijay) టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం జన నాయగన్ (Jana Nayagan). కార్తీ (ఖాకీ) ఫేం హెచ్‌వి నోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తెలుగులో ప్రజల నాయకుడు టైటిల్‌తో వస్తోంది. ఈ చిత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం జనవరి 9నే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ బోర్డ్ సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో విజయ్ టీం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.
రాజకీయ కారణాలతో జననాయగన్ సినిమాకు ఇబ్బందులు కలిగిస్తున్నారని టీవీకే ఆరోపిస్తుండగా.. రీసెంట్గా సెన్సార్ బోర్డు సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఒకవేళ నిర్మాతలు ఏదైనా అప్పీలు చేస్తే తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని సెన్సార్ బోర్డు అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. ఇదిలా ఉంటే తాజాగా ఆసక్తికర కథనం ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మేకర్స్ అభ్యంతరకర సంభాషణలు, సీన్లు సహా 20 నిమిషాల పుటేజీని తొలగించేందుకు ఒప్పుకున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే జననాయగన్ ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశాలున్నాయని అర్థమవుతుంది. ఇక మరోవైపు జననాయగన్ అమెజాన్ ప్రైం వీడియోలో స్ట్రీమింగ్ కానుండగా.. ఎలాంటి కట్స్ లేకుండా ఓటీటీలో సందడి చేయనుందని కూడా వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతానికైతే ఈ వార్తలపై అధికారికంగా ఎలాంటి అప్డేట్స్ లేవు. ఒకవేళ తాజా వార్తలు నిజమైతే అభిమానులు త్వరలోనే జననాయగన్‌ను ఓవైపు థియేటర్లలో.. మరోవైపు ఓటీటీలో అన్‌కట్ వెర్షన్‌ను చూడొచ్చన్నమాట. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. కన్నడ టాప్ బ్యానర్ కేవీఎన్ ప్రోడక్షన్ నిర్మిస్తోన్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో చివరి సినిమాగా వస్తోంది జననాయగన్.