బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన సోనాక్షి సిన్హా తన కెరీర్లోనే తొలిసారిగా వెబ్ సిరీస్‌లో తళుక్కుమన్నది. అమెజాన్ ప్రైమ్‌లో సూపర్‌హిట్‌గా రన్ అవుతున్న ఆ వెబ్ సిరీస్.. ‘దహాడ్’. సూపర్‌కాప్ పాత్రలో నటించిన సోనాక్షి తన మనసులోని మాటలు పంచుకుందిలా.
స్క్రిప్ట్ చదవగానే.. కొత్తగా అనిపించింది. నా పాత్ర పవర్‌ఫుల్‌గా అనిపించింది. మహిళ అంటేనే శక్తికి నిర్వచనం. ఆ అవకాశాన్ని వదులుకోవద్దని మనసు హెచ్చరించింది. వెంటనే ఓకే చెప్పేశా.
సినిమాల్లో పాత్రలకు అతీత శక్తులుంటాయి. ఏదైనా సాధించేస్తారు. ఎంత త్యాగమైనా చేస్తారు. కానీ.. నిజ జీవితంలో అలా ఉండదు. రియల్ లైఫ్
పోలీసులు లేకపోతే మనమంతా ఇంత హ్యాపీగా ఉండలేం. వాళ్లే నిజమైన హీరోలు.
జీవితంలో, కెరీర్లో చాలా మిస్ అవుతుంటాం. ఆ క్షణంలో బాధపడతాం. అలా అని వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు సాగలేం. కొన్ని టైమ్ షెడ్యూల్స్, కమిట్మెంట్స్ వల్ల వదులుకోవాల్సి వచ్చిన సినిమాలు ప్రతి యాక్టర్‌కూ ఉంటాయి. నేనూ అతీతం కాదు.
బైక్ రైడింగ్ నేర్చుకున్నా. దర్శకుడు భరత్ భట్నాగర్ డైలాగ్ డెలివరీ డిఫరెంట్‌గా ఉండాలన్నారు. అందుకు చాలా ప్రాక్టీస్ చేశా.
నిజం చెప్పాలంటే ఒక పవర్ఫుల్ వుమెన్ పాత్ర చేయాలని ఎప్పటి నుంచో ఉంది. అంజలీ భాటి పాత్ర ఆ లోటును పూడ్చేసింది.
నా డ్రీమ్ రోల్ ఇదే.