మన హీరోలకు పాటలు పాడటం ఒక సరదా. అందుకే అప్పుడప్పుడు తమ సినిమాల్లో పాటలు పాడేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అవి కూడా బ్లాక్ బస్టర్ అవుతుంటాయి. అప్పుడెప్పుడో మృగరాజు సినిమాలో చిరంజీవి పాడిన చాయ్ చటుక్కునా తాగరా బాయ్ అనే పాట ఇప్పటికీ అభిమానులు పాడుకుంటారు. అలాగే పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ పాడిన పాటలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ బాటలోనే రవితేజ కూడా నడుస్తున్నాడు. ఈయన కూడా తన సినిమాల్లో పాటలు పాడుతూ ఉన్నాడు. బలుపు సినిమా కోసం తమన్ కంపోజ్ చేసిన కాజల్ చెల్లివా పాటకు స్వరం కలిపాడు మాస్ రాజా. ఆ తర్వాత పవర్ సినిమాలో నోటంకి పాటతో దుమ్ము దులిపేశాడు. ఈ పాట చాలా బాగా క్లిక్ అయింది.
దాంతో ఇప్పుడు మరోసారి తన సింగింగ్ టాలెంట్ బయటకు తీస్తున్నాడు రవితేజ. ప్రస్తుతం ఈయన రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఖిలాడి. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు మాస్ రాజా. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో టైటిల్ సాంగ్ రవితేజ పాడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యే రికార్డింగ్ కూడా పూర్తి చేశాడు దేవి శ్రీ ప్రసాద్. ఆయన కోసం ఒక క్యాచీ ట్యూన్ డీఎస్పీ సిద్ధం చేశాడు. త్వరలోనే ఈ పాటను విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు.
ఇదిలా ఉంటే ఖిలాడీ సినిమాతో పాటు రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో కూడా నటిస్తున్నాడు మాస్ రాజా. ఇందులో గవర్నమెంట్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు రవితేజ. కొత్త దర్శకుడు శరత్ మండవ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శరత్. ఆల్రెడీ సంక్రాంతికి వచ్చి సంచలన విజయం సాధించిన క్రాక్ సినిమా కూడా వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. రామారావు ఆన్ డ్యూటీ కూడా క్రాక్ మాదిరే క్రాకింగ్ హిట్ అవుతుందని నమ్ముతున్నాడు రవితేజ. మొత్తానికి కేవలం నటుడిగానే కాకుండా గాయకుడిగా కూడా సత్తా చూపించాలని ఉవ్విళ్లూరుతున్నాడు ఈ సీనియర్ హీరో.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Nani vs Theater Owners | సీన్ యూ టర్న్.. నానికి క్షమాపణలు చెప్పిన థియేటర్స్ అసోసియేషన్
గుండెపోటుతో కేరళకు చెందిన ప్రముఖ నటి మృతి..!
OTT | మెల్లిమెల్లిగా ఓటీటీలు టాలీవుడ్‌ను కమ్మేస్తున్నాయా?
మెగా డాటర్ డెబ్యూ మూవీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
సినిమాలని వదిలేసి బిజినెస్ చేసే ఆలోచనలో మంచు మనోజ్..!
సెక్స్ రాకెట్ నడుపుతున్న మోడల్ని అరెస్ట్ చేసిన పోలీసులు