అక్షయ్‌కుమార్, పరేష్‌రావల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఓ మై గాడ్’ చిత్రం అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తెలుగులో పవన్‌కల్యాణ్, వెంకటేష్ లీడ్ రోల్స్‌లో ‘గోపాల గోపాల’ పేరుతో రీమేక్ జరుపుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఓ మై గాడ్-2’ తెరకెక్కుతున్నది. ఆగస్ట్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. త్వరలో టీజర్‌ను విడుదల చేయబోతున్నారు.
ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు అక్షయ్‌కుమార్ శివుడి పాత్రలో తన కొత్త పోస్టర్‌ను ఇన్స్టాగ్రామ్ వేదికగా విడుదల చేశారు. తొలిభాగంలో ఓ నాస్తికుడితో దేవుడి సంవాదం నేపథ్యంలో కోర్ట్ రూమ్ డ్రామాను పండించిన దర్శకుడు రెండో భాగంలో కూడా ఆసక్తికరమైన కథను ఎంచుకున్నారని చెబుతున్నారు. తొలి భాగంలో అక్షయ్‌కుమార్ శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. సీక్వెల్లో శివుడి పాత్ర మరింత శక్తివంతంగా సాగుతుందని అక్షయ్‌కుమార్ పేర్కొన్నారు. ఆద్యంతం వినోదంతో పాటు సామాజిక సందేశం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి అమిత్రాయ్ దర్శకత్వం వహించారు.