టాలీవుడ్ (Tollywood) సీనియర్ హీరో చిరంజీవి (Chiranjeevi) చేస్తున్న కొత్త ప్రాజెక్టుల్లో ఒకటి భోళా శంకర్ (Bhola Shankar). వేదాళమ్ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మెహర్ రమేశ్ (Meher Ramesh) దర్వకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో కీర్తిసురేశ్ చిరంజీవి సోదరి పాత్రలో నటిస్తోంది. కాగా మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannah) ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. తమన్నాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. మిల్కీ బ్యూటీ భోళా శంకర్‌కు అధికారికంగా సంతకం చేసిందని, ఈ ప్రాజెక్టులో నటించేందుకు భారీ మొత్తంలో అడ్వాన్స్ కూడా తీసుకుందని తాజా టాక్.
తమన్నా ఇప్పటికే చిరంజీవితో కలిసి సైరా చిత్రంలో మెరిసింది. ఇటీవలే మాస్టర్ చెఫ్ షో నుంచి తప్పుకున్న తమన్నా ప్రస్తుతానికి చిరంజీవి భారీ ప్రాజెక్టుపైనే తన ఫోకస్ పెట్టనుంది.
ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం లూసిఫర్‌కు రీమేక్‌గా వస్తున్న (Godfather) చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత బాబీ దర్శకత్వంలో చేయనున్న చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది.
గాడ్‌ఫాదర్ చిత్రానికి మోహన్ రాజా డైరెక్టర్. భోళా శంకర్ షూటింగ్ షెడ్యూల్ వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. తమన్నా ఇటీవలే గోపీచంద్‌తో కలిసి నటించిన సీటీమార్ బాక్సాపీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Samantha: సమంత బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపడానికి ఆ హీరోయిన్ కారణమా?Chiranjeevi: మెగాస్టార్ న్యూ లుక్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్
Puneet Raj Kumar: పునీత్ చివరి సినిమా కోసం మేకర్స్ సరికొత్త ప్రయత్నం..!