IPL 2026 : మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ సందడికి తెరలేవనుండగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు పెద్ద షాక్ తగిలింది. విధ్వంసక ఓపెనర్ బెన్ డకెట్ (Ben Duckett) ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. జాతీయ జట్టుకు ప్రాధాన్యం ఇవ్వాలని భావించి కఠినమైన నిర్ణయం తీసుకున్నట్టు డకెట్ వెల్లడించాడు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ పేసర్‌ను పట్టేసింది. గాయంతో టోర్నీకి దూరమైన నాథన్ ఇల్లిస్ స్థానంలో ఆస్ట్రేలియాకే చెందిన స్పెన్సర్ జాన్సన్ (Spencer Jhonson)తో సీఎస్కే ఒప్పందం చేసుకుంది.
పంతొమ్మిదో సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తురుపుముక్క అవుతాడనుకున్న బెన్ డకెట్ ఊహించని షాకిచ్చాడు. మరో నాలుగు రోజుల్లో టోర్నీ ఉందనగా నేను వైదొలుగుతున్నా అని బాంబ్ పేల్చాడు. ‘ఐపీఎల్ నుంచి వైదొలగాలని నేను చాలా కష్టమైన నిర్ణయం తీసుకున్నా. ఇంగ్లండ్‌కు ఆడాలనేది నా చిన్నప్పటి కల. ఇంగ్లండ్ క్రికెట్ కోసం ఏదైనా ఇవ్వాలనకుంటున్నా.
“Growing up, I only dreamed of playing for England.”
~ Ben Duckett.
Duckett has withdrawn from the IPL with Delhi Capitals, accepting a three-year ban and financial loss, to prioritise his England career.
He also apologised for the Noosa drinking incident, admitting the Ashes… pic.twitter.com/UYLgVxLxs9
— Cricketopia (@CricketopiaCom) March 24, 2026
వేసవిలో సిరీస్‌ల కోసం శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నా. ఢిల్లీ యాజమాన్యం, అభిమానులు నన్ను క్షమించండి’ అని డకెట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించాడు. మినీ వేలంలో రూ.2 కోట్లు పలికన డకెట్పై ఢిల్లీ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ, నిరుడు హ్యారీ బ్రూక్ మాదిరిగా అతడు తీరా సీజన్ ప్రారంభానికి ముందు ఢిల్లీకి షాకిచ్చాడు. అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ తొలి పోరులో తలపడనుంది.
🚨ANOTHER HUMILIATION FOR PAKISTAN 🚨
March 15 – Spencer Johnson withdrew from PSL due to personal reasons.
Today – Spencer Johnson signed by CSK for IPL 2026. pic.twitter.com/t8K5LgSPpR
— lndian Sports Netwrk (@IS_Netwrk29) March 22, 2026
ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కొత్త పేసర్‌ను తీసుకుంది. తొడ కండరాల గాయంతో నాథన్ ఎల్లిస్ ఐపీఎల్‌కు దూరమవ్వడంతో అతడి స్థానంలో స్పెన్సర్ జాన్సన్‌తో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. వ్యక్తిగత కారణాలతో పాకిస్థాన్ సూపర్ లీగ్ నుంచి తప్పుకున్న ఈ స్పీడ్‌స్టర్ ఇప్పుడు ఐపీఎల్లో చెలరేగాలని భావిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను మార్చి 30న ఢీకొట్టనుంది.