ACB : ఖమ్మంలో ఓ అవినీతి అధికారి ఏసీబీ చిక్కాడు. వైరా ఆర్టీఏ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వరప్రసాద్ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. అవినీతికి పాల్పడినందుకు అదుపులోకి తీసుకున్నారు.
ఇటుకబట్టి వ్యాపారి నుంచి రూ.24 వేలు లంచం తీసుకుంటున్న వరప్రసాద్‌ను మంగళవారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అతడి నుంచి దస్త్రాలను స్వాధీనం చేసుకొని అవినీతికి పాల్పడినందుకు అదుపులోకి తీసుకున్నారు.