Rinku Singh : భారత క్రికెటర్, పొట్టి వరల్డ్‌కప్ హీరో రింకూ సింగ్(Rinku Singh)కు ప్రమోషన్ లభించింది. ఐపీఎల్లో సంచలన ఆటతో వెలుగులోకి వచ్చిన రింకూ వైస్ కెప్టెన్‌గా పదోన్నతి పొందాడు. పంతొమ్మిదో సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) కెప్టెన్ అజింక్యా రహానేకు ఈ సిక్సర్ల వీరుడు డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఫినిషర్‌గా రాణిస్తున్న ఈ లెఫ్ట్ హ్యాండర్‌కు వైస్ కెప్టెన్సీ ఇస్తున్నట్టు మంగళవారం కోల్‌కతా ఫ్రాంచైజీ వెల్లడించింది.
ఐపీఎల్‌కు గడువు సమీపిస్తున్న వేళ ఫ్రాంచైజీలు నైట్ ఈవెంట్లతో అభిమానులను అలరిస్తున్నాయి. నైట్స్ అన్ప్లగింగ్ పేరుతో కోల్‌కతా నైట్ రైడర్స్ మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా కెప్టెన్ అజింక్యా రహానేకు డిప్యూటీగా రింకూ సింగ్ వ్యవహరిస్తారని ఫ్రాంచైజీ వెల్లడించాడు. ఫినిషర్ రింకూకు అదనపు బాధ్యతలు ఇవ్వడంపై హెడ్‌కోచ్ అభిషేక్ నాయర్ ఏమన్నాడంటే..?
Captain. Vice-Captain. Sorted 😌💜 pic.twitter.com/reeySu1chL
— KolkataKnightRiders (@KKRiders) March 24, 2026
‘వైస్ కెప్టెకి రింకూ బాగా సరిపోతాడు. నేను కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరినప్పుడు.. సహాయక సిబ్బందిగా ఉన్నప్పుడు నా తొలి జ్ఞాపకం రింకూ సింగ్‌తో పని చేయడం. ఇప్పుడు హెడ్‌కోచ్ అయ్యాను. ఏళ్లుగా రింకూ సింగ్ క్రికెటర్‌గానే కాదు నాయకుడిగానూ ఎదగడం మనం చూశాం. గత రెండు మూడు సీజన్లలో అతడి ప్రదర్శన అద్భుతం. ఫీల్డింగ్నూ అతడు చురుకుగా కదులుతాడు. మొత్తంగా జట్టు కోరుకునే వ్యక్తి అతడు. పవర్ హిట్టరైన అతడికి అదనపు బాధ్యతలు ఇవ్వాల్సిన సమయం వచ్చిందని భావించాం. వరల్డ్‌కప్ ఛాంపియన్ కూడా అయిన రింకూకు వైస్ కెప్టెన్సీ ఇవ్వడానికి ఇదే సరైన సమయం. ఈ బాధ్యతను స్వీకరించి..జట్టును విజయబాటలో నడుపుతాడని ఆశిస్తున్నా’ అని అభిషేక్ నాయర్ పేర్కొన్నాడు.
Rinku Singh. Vice Captain. KKR 😍💜
Watch the Knights Unplugged 3.0 LIVE now on our YouTube channel 📲 pic.twitter.com/bsne3dRpDL
— KolkataKnightRiders (@KKRiders) March 24, 2026
ఐపీఎల్ 2023 సీజన్లో రింకూ సింగ్ పేరు మార్మోగిపోయింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్ యశ్ దయాల్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లతో కోల్‌కతాను ఒంటిచేత్తో గెలిపించాడు రింకూ. విధ్వంసక ఆటతో కోల్‌కతా బ్యాటింగ్‌లో కీలక ఆటగాడిగా ఎదిగిన రింకూను 18వ సీజన్ కోసం రూ.13 కోట్లకు అట్టిపెట్టుకుంది. నిరుడు ఈ చిచ్చరపిడుగు 206 పరుగులు సాధించాడు.