Mamitha Baiju | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తోన్న తాజా చిత్రం దళపతి 69 (Thalapathy 69) హెచ్ వినోథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ మూవీ లవర్స్, అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విజయ్‌తో పూజా హెగ్డే రొమాన్స్ చేయబోతుందని తెలియజేస్తూ అప్డేట్ కూడా షేర్ చేశారు. మరోవైపు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ముందుగా వచ్చిన వార్తలే నిజమయ్యాయి.
ఈ చిత్రంలో ప్రేమలు ఫేం మమితా బైజు కీలక పాత్రలో నటిస్తోంది. మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రం 2025 అక్టోబర్‌లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
విజయ్ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో..ఇక రాజకీయాలపై ఫోకస్ పెట్టబోతున్నాడని తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రం దళపతి కెరీర్లో చివరిది కాబోతుంది. కమర్షియల్ ఎంటర్టైనర్గా రానున్న ఈ మూవీ కాప్ డ్రామా నేపథ్యంలో ఉండబోతుందని టాక్ జోరుగా నడుస్తోంది. ఈ చిత్రంలో మరోసారి విజయ్ పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్నాడని వార్తలు వస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
We are happy to ‘OFFICIALLY’ announce that Mini Maharani #MamithaBaiju joins #Thalapathy69 cast 😁 #Thalapathy69CastReveal#Thalapathy @actorvijay sir #HVinoth @thedeol @hegdepooja @anirudhofficial @Jagadishbliss @LohithNK01 pic.twitter.com/PNwYBqCAiS
— KVN Productions (@KvnProductions) October 2, 2024
Mammootty | షూటింగ్ టైం.. లొకేషన్లో జైలర్ విలన్‌తో మమ్ముట్టి
Anushka Shetty | అనుష్క వెడ్డింగ్‌కు వేళాయె.. క్రేజీ వార్తలో నిజమెంత..?
Pooja hegde | విజయ్‌తో రొమాన్స్ వన్స్‌మోర్.. దళపతి 69 హీరోయిన్ ఫైనల్..!
NTR Neel | ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కథ ఇదే.. హీరోయిన్ కూడా ఫైనల్.. !