Tamannah Bhatia| మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఓదెల 2 (Odela 2). 2021లో విడుదలైన “ఓదెల రైల్వే స్టేషన్” సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా రాబోతుంది. సూపర్నాచురల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది (Sampath Nandi) కథను అందిస్తుండగా.. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. మధు క్రియేషన్స్ మరియు సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్లపై డి. మధు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా ఒక నాగ సాధువు పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే.. ఓదెల గ్రామాన్ని దుష్ట శక్తుల నుంచి నాగ సాధువు అయిన తమన్నా ఎలా రక్షిస్తుంది అనే కథాంశంతో ఈ సినిమా రాబోతుంది. ఇక టీజర్ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే శివ భక్తి గీతం గుస్ బంప్స్ తెప్పించేలా ఉండగా.. తమన్నా యొక్క నాగ సాధువు లుక్, ఆమె తీవ్రమైన యాక్షన్ సన్నివేశాలు టీజర్లో హైలైట్‌గా నిలిచాయి.