ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘డ్రాగన్’ (టైటిల్ ఇంకా ఖరారు కాలేదు) సినిమా నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఎన్టీఆర్‌ను మునుపెన్నడూ చూడని రీతిలో అత్యంత శక్తివంతంగా ఆవిష్కరిస్తూ దర్శకుడు ప్రశాంత్‌నీల్ స్క్రిప్ట్ రాశారని, ఆయన పాత్ర హై ఇంటెన్స్ యాక్షన్, ఎమోషన్స్‌తో సాగుతుందని చెబుతున్నారు.
ఈ సినిమా గురించి తాజా అప్డేట్ ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమా సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కథకు ఆయువుపట్టులా ఉంటుందట. ఈ ఎపిసోడ్లో ఎన్టీఆర్ పాత్ర మాఫియా నేపథ్యంలో నడుస్తుందని, ఈ సన్నివేశాలపై దర్శకుడు ప్రశాంత్‌నీల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోబోతున్నారని అంటున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం ముప్పై శాతానికి పైగా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవిబస్రూర్ సంగీతాన్నందిస్తున్నారు. రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్నది.