సోమవారం 01 జూన్ 2020
Cinema - May 05, 2020 , 13:41:56

ఫ్యామిలీతో యానివ‌ర్స‌రీ జ‌రుపుకున్న ఎన్టీఆర్

ఫ్యామిలీతో యానివ‌ర్స‌రీ జ‌రుపుకున్న ఎన్టీఆర్

ఎప్పుడు సినిమాల‌తో బిజీ బిజీగా ఉండే జూనియ‌ర్ ఎన్టీఆర్ లాక్‌డౌన్ వ‌ల‌న ఇంటికే పరిమిత‌మ‌య్యారు. భార్య‌తో ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి ఆనంద క్ష‌ణాలు గ‌డుపుతున్నారు. అయితే 2011 మే 5న ఎన్టీఆర్ త‌న బంధువుల అమ్మాయి లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకోగా, నేటితో వారి దాంప‌త్య జీవితానికి తొమ్మిదేళ్లు పూర్తైంది. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్  9వ వెడ్డింగ్ యానివర్సరీని ల‌క్ష్మీతో పాటు తమ ఇద్దరు పిల్లలైన అభిరామ్, భార్గవ్ రామ్ లతో జ‌రుపుకోనున్నారు.

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర పోషిస్తున్న‌సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ వ‌ల‌న చిత్ర షూటింగ్‌కి బ్రేక్ ప‌డ‌గా, మ‌రి కొద్ది రోజుల‌లో తిరిగి షూటింగ్ ప్రారంభం కానుంది. మే 20న ఎన్టీఆర్ బ‌ర్త్ డే కావ‌డంతో ఆ రోజు జూనియ‌ర్‌కి సంబంధించిన స‌ర్‌ప్రైజ్ రాజ‌మౌళి రివీల్ చేయ‌నున్నాడ‌ని అభిమానులు భావిస్తున్నారు. 


logo