Vijay Devarakonda | రౌడీ హీరో విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘వీడీ12’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రానుండగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సినిమా టీజర్‌తో పాటు టైటిల్‌కి సంబంధించి చిత్రబృందం అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. నిశ్శబ్ద కిరీటం రాజు కోసం వేచి చూస్తోంది.. టైటిల్ టీజర్ ఈ నెల 12న విడుదల కాబోతుందంటూ ప్రకటించింది. పీరియాడిక్ కథతో రాబోతున్న ఈ సినిమాకి ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇదిలావుంటే ఈ సినిమా టీజర్‌కి సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా టీజర్‌కి తెలుగులో అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. తెలుగులో ఎన్టీఆర్ ఇవ్వనుండగా.. బాలీవుడ్లో రణబీర్ కపూర్, తమిళంలో సూర్య, మలయాళంలో దుల్కర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.