NTR 30 Diamond | తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం వరస సినిమాలతో దూసుకుపోతున్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయనకు చాలా మంది దర్శకులతో మంచి అనుబంధం ఉంది. అందులో కొరటాల శివ కూడా ఉన్నాడు. తారక్‌కు ఒకసారి కనెక్ట్ అయితే విడిపోవడం కష్టం. అందుకే రాజమౌళి, వినాయక్ లాంటి దర్శకులు ఆయన వరుసగా సినిమాలు చేశారు. కొరటాల శివతో కూడా జూనియర్ ఎన్టీఆర్ కు అలాంటి కాంబినేషన్ సెట్ అయింది. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ సెన్సేషనల్ కాంబినేషన్స్‌లో ఎన్టీఆర్, కొరటాల శివ కూడా ఒకటి. ఈ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఇదే క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. వారం రోజుల్లోనే ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ ఉంటుందనే వార్త ఇప్పుడు టాలీవుడ్లో చక్కర్లు కొడుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్ అనుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా ఎంతటి విజయం సాధించిందనేది ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఐదేళ్ల కింద వచ్చిన ఈ చిత్రం 80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు అప్పట్లో కోట్లు విలువ చేసే విల్లాను జూనియర్ ఎన్టీఆర్ ఈ దర్శకుడికి బహుమతిగా ఇచ్చాడు కూడా. జనతా గ్యారేజ్‌కు ముందు బృందావనం సినిమాకు కూడా కథ, మాటలు రాశాడు కొరటాల శివ. అప్పుడే కొరటాల గురించి చాలా గొప్పగా చెప్పాడు ఎన్టీఆర్. దర్శకుడు అయిన తర్వాత ఈయనతో జనతా గ్యారేజ్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత భరత్ అనే నేనుతో పర్లేదనిపించాడు కొరటాల. ఇప్పుడు చిరంజీవితో ఆచార్య చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి కాగానే జూనియర్ ఎన్టీఆర్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు కొరటాల శివ. అంతేకాదు పోయినసారి రిపేర్లు లోకల్లో జరిగాయి కానీ ఈ సారి పాన్ ఇండియన్ స్థాయిలో జరుగుతాయని క్లారిటీ ఇచ్చాడు కొరటాల శివ. మరి ఆ పాన్ ఇండియన్ కథ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
జనతా గ్యారేజ్ లో ఎప్పట్లాగే నాయకుడు కథను చూపించాడు కొరటాల. ఇప్పుడు మరోసారి ఈయన పవర్ ఫుల్ కథతోనే రాబోతున్నాడని తెలుస్తుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఎలా కనిపిస్తాడు.. ఎలా ఉంటాడు అనే దానిపై ఇప్పట్నుంచే నందమూరి అభిమానులు ఊహించుకుంటున్నారు. ఓ చిన్న ఊరు నుంచి పట్నం వచ్చి అక్కడ ఎలా రూలర్ గా మారాడు.. జనానికి అండగా ఎలా ఉన్నాడు అనే లైన్ తో ఈ సినిమాను కొరటాల తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. పరిస్థితుల కారణంగా సాధారణంగా ఉన్న వ్యక్తి.. అసాధారణంగా ఎలా ఎదిగాడు అనేది చాలా సినిమాల్లో చూసిన కథే. రొటీన్ గానే ఉన్న ఈ కథను కమర్షియల్ గా తెరకెక్కించడంలో కొరటాల సిద్ధహస్తుడు. ఈ సినిమా బడ్జెట్ కూడా 200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అంతేకాదు దీనికి డైమండ్ ( Diamond ) అనే పాన్ ఇండియన్ టైటిల్ అనుకుంటున్నారు. అన్ని భాషలలో ఒకే టైటిల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు కొరటాల శివ. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. సినిమాపై పూర్తి వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bigg boss 5 telugu | ఈ సీజన్లో ఫస్ట్ లవ్ స్టోరీ ఎవరిదో తెలుసా..?
Nivetha: ఆవు పాలు పితికి, కాఫీ చేసుకున్న వకీల్ సాబ్ భామ
RC 15 Poster | కేవలం పోస్టర్ కోసమే శంకర్ కోట్లు ఖర్చు పెట్టించాడా..?
Nayanthara | పెళ్లి తర్వాత నటనపై నయనతార నిర్ణయం