Nayanthara |పెళ్లి తర్వాత నటనపై నయనతార నిర్ణయం
దశాబ్దకాలానికి పైగా తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది బెంగళూరు చిన్నది నయనతార (Nayanthara). పెళ్లి తర్వాత ఈ లేడీ సూపర్ స్టార్ అభిమానులకు దూరమవుతుందా..? ఇక సినిమాల్లో కనిపించదా..? అంటూ అంతా చర్చించుకోవడం మొదలుపెట్టారు.

దశాబ్దకాలానికి పైగా తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది బెంగళూరు చిన్నది నయనతార (Nayanthara). స్టార్ హీరోలతో నటించడమే కాకుండా ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలతో కోట్లాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్నది. ఈ భామ దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో అగ్రస్థానంలో ఉంది. కాగా ఈ బ్యూటీ కోలీవుడ్ దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)ను పెళ్లి (marriage) చేసుకోనున్న విషయం తెలిసిందే. డిసెంబర్ లో వెడ్డింగ్ కు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఇంతకీ విషయమేంటంటే ఇప్పటివరకు అంతా బాగానే ఉంది కానీ పెళ్లి తర్వాత ఈ లేడీ సూపర్ స్టార్ అభిమానులకు దూరమవుతుందా..? ఇక సినిమాల్లో కనిపించదా..? అంటూ అంతా చర్చించుకోవడం మొదలుపెట్టారు. కాగా దీనిపై నయన్ స్పష్టతకు వచ్చినట్టు ఇన్ సైడ్ టాక్. ఈ భామ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న గాడ్ ఫాదర్ లో కీలక పాత్ర పోషిస్తోంది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ కొనసాగుతోంది. మరోవైపు షారుక్ ఖాన్-అట్లీ సినిమాలో నటించనుంది. వీటితోపాటు కొన్ని ఫీమేల్ ఓరియెంటెడ్ కథాంశాలపై చర్చలు జరుపుతోంది.

మరి రేపో మాపో విఘ్నేశ్ శివన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఈ సినిమా పరిస్థితేంటి అని ఆలోచిస్తున్న వారి కోసం నయన్ ఓ నిర్ణయానికి వచ్చిందట. పెళ్లి తర్వాత కూడా తన ఇష్ట ప్రకారం సినిమాలు చేయాలని, వివాహంతో సినీ కెరీర్ కు వచ్చిన ఇబ్బంది లేదని ధీమా ఉందని కోలీవుడ్ వర్గాల టాక్. ఇప్పటికే టాలీవుడ్ భామ సమంత అక్కినేని నాగచైతన్యతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోయిన్ గా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
Nivetha: ఆవు పాలు పితికి, కాఫీ చేసుకున్న వకీల్ సాబ్ భామ
Drugs Case: ఈడీ ఆఫీసుకి చేరుకున్న రానా..!
Sanjay Dutt: సౌత్లోను బిజీ అవుతున్న సంజయ్ దత్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

