Loksabha Elections 2024 | ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు : మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
Loksabha Elections 2024 : ప్రధాని నరేంద్ర మోదీ తన స్దాయికి తగని వ్యాఖ్యలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని కాంగ్రెస్ ఆక్షేపించింది.
Loksabha Elections 2024 : ప్రధాని నరేంద్ర మోదీ తన స్దాయికి తగని వ్యాఖ్యలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని కాంగ్రెస్ ఆక్షేపించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆస్తుల పున:పంపిణీ చేసి కొందరికి వాటిని కట్టబెడుతుందని మోదీ చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొంది.
రాజస్ధాన్‌లోని జలోర్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ దేశ వనరులపై తొలి హక్కు ముస్లింలకు ఉంటుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ మీ ఆస్తులను లాగేసుకుని తమకు ఇష్టమైన వారికి కట్టబెడుతుందనే తరహాలో మోదీ మాట్లాడటం సరైంది కాదని వ్యాఖ్యానించింది. దేశ ప్రధాని నుంచి ఆ తరహా ప్రకటనను దేశం ఆశించలేదని కాంగ్రెస్ ఎంపీ కే. సురేష్ ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రధాని చేసిన వ్యాఖ్యలు సహించరానివని పేర్కొన్నారు. గతంలో మాజీ ప్రధానులు ఎంతో హుందాగా, మర్యాదగా వ్వవహరించేవారని, వారు విపక్షాన్ని గౌరవించేవారని గుర్తుచేశారు. ప్రతిపక్షాలను అప్పటి ప్రధానులు విమర్శించినా హుందాగా వ్యాఖ్యలు చేసేవారని ఆయన పేర్కొన్నారు. ఇక కేరళలో తమ ప్రచారం సాఫీగా సాగుతోందని, గత ఎన్నికల కంటే మెరుగైన స్ధానాలు సాధిస్తామని చెప్పారు.
Read More :
Konda Vishweshwar Reddy | చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తి ఎంతో తెలుసా..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
Rising Stars Asia Cup: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు తిలక్ వర్మ కెప్టెన్సీ.. జట్టులో అభిషేక్, వైభవ్
RJD Somireddy | విద్యా ప్రమాణాల పెంపునకు సమష్టి కృషి చేయాలి : ఆర్జేడీ సోమిరెడ్డి
Sharad Pawar | శరద్ పవార్‌కు ఛాతిలో నొప్పి.. పూణె ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

